యువత ప్రతిభ గుర్తింపునకే యువజన, క్రీడా వారోత్సవాలు

– గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ముగింపు వేడుకలు
– ఉద్యోగ నియామక పత్రాలు, మెడల్స్, ప్రశంసా పత్రాల ప్రదానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన యువజన క్రీడా వారోత్సవాలు ఘన విజయాన్ని సాధించాయని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన యువజన క్రీడా వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన స్పోర్ట్స్ అథారిటీ ఎండీ అండ్ కమిషనర్-యూత్ సర్వీసెస్ డాక్టర్ డాక్టర్ ఎ.సోనీ బాలాదేవితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన జాబ్ మేళాల్లో ఎంపికైన యువతకు నియామక పత్రాలను అందజేయడంతోపాటు గురువారం 21న నిర్వహించిన స్పోర్ట్స్ డే పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు మెడల్స్, ట్రోఫీలు ప్రదానం చేశారు. అలాగే ఆరు రోజులపాటు నిర్వహించిన వివిధ క్రీడా, సాంస్కృతిక, యువజన కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. జాబ్ మేళాల్లో భాగస్వామ్యమైన పలు సంస్థల ప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా శివసేన రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మట్టిలో మాణిక్యాల్లాంటి ప్రతిభావంతులైన యువత దాగి ఉంది.. అలాంటి వారిలో ప్రతిభను వెలికితీసి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. యువతను క్రీడలు, ఉపాధి, వ్యక్తిత్వ వికాసం వైపు మలిచేందుకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కీలక వేదికగా నిలుస్తోంది అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 99 రోజులపాటు మహాయజ్ఞంలా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో యువజన క్రీడా వారోత్సవాలు ప్రత్యేక గుర్తింపు సాధించాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు, క్రీడా శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని ప్రశంసించారు. డాక్టర్ సోనీ బాలాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 1 నుంచి 11వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో ఘనంగా జాబ్ మేళాలు నిర్వహించామని తెలిపారు. 18 నుంచి 23 వరకు ప్రతి రోజూ ప్రత్యేక కాన్సెప్ట్‌తో నిర్వహించిన కార్యక్రమాల్లో యువకులు, క్రీడాకారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు విశేష ఉత్సాహంతో పాల్గొన్నారని పేర్కొన్నారు. క్రీడలు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, యువజన చైతన్యం వంటి అంశాలపై నిర్వహించిన కార్యక్రమాలకు పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ, జిల్లా యంత్రాంగం, స్పోర్ట్స్ అథారిటీ, యువజన సేవల శాఖలు సహకరించాయని ఆమె అన్నారు. కార్యక్రమంలో యువజన సేవల శాఖ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాల్, స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ భాషా, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మల్లారెడ్డి, డీట్ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, టాస్క్ సీఈవో నితిన్ రెడ్డి,  స్పోర్ట్స్ అథారిటీ, యువజన సేవల శాఖ, పరిశ్రమల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *