- విద్య, వైద్యా రంగాల్లో కూడా తొలి ప్రాధాన్యతగా పనులు
- మా కార్యకర్తల జోలికి వొస్తే ఊరుకునేది లేదు…
- తప్పు చేస్తే మా పార్టీవారైనా ఉపేక్షించేది లేదు..
- పార్టీ కష్ట కాలంలో వెంట ఉన్న ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటా…
- సంయమనం పాటిస్తే అన్నీ మంచి రోజులే…
- ట్విట్టర్ వేదిక జరిగిన మీటింగ్ లో ఎమ్మెల్యే నాయిని..
హన్మకొండ, ప్రజాతంత్ర, నవంబర్ 24 : పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో వెంట నిలబడిన ప్రతి ఒక్కరికి సమయానుకూలంగా సమూచిత స్థానం కల్పిస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఎక్స్ వేదికగా నిర్వహించిన మీటింగ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గడిచిన ఏడాది కాలంగా జరిగిన అభివృద్ధి, సంక్షేమం పట్ల సుధీర్గంగా చర్చించారు. అక్రమంగా సంపాదించిన ధన దాహంతో ప్రతిపక్షాలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పడు ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. యూ ట్యూబ్ ఛానల్ ల ద్వారా అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ప్రజా ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నారని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీల వైఖరిని సామాజిక మధ్యమాల వేదికగా ఎప్పటికప్పుడు ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలనీ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత మహానగర అభివృద్ధికి గతంలో కంటే అధిక నిధులను కేటాయించిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలాని కోరారు.
గత ప్రభుత్వ హయాంలో వెళ్లిన స్మార్ట్ నిధులను తిరిగి తీసుకొచ్చి ఉపయోగిస్తున్నామని ఇప్పటికే 84కోట్ల నయీమ్ నగర్ బ్రిడ్జి, రూ.60కోట్ల స్మార్ట్ సిటీ అభివృద్ధి, 30కోట్ల తో భద్రఖాళీ అమ్మవారి మాఢ వీధుల అభివృద్ధి, రూ.6 కోట్లతో గోకుల్ నగర్ జంక్షన్ నుంచి రాజాజీ నగర్ వరకు సైడ్ డ్రైన్, రూ.28కోట్లతో నూతన పాలిటెక్నిక్ భవన నిర్మాణం, రూ.50 కోట్లతో వర్షాల వలన దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, రూ.10 కోట్ల సీడీపీ నిధుల అభివృద్ధి, రూ.90కోట్లతో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం, 2కోట్లతో బాలసముద్రం నూతన బిటి రోడ్డు నిర్మాణం, రూ.15కోట్లతో ప్రధాన కూడళ్ల అభివృద్ధి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టితో రెండవ అతిపెద్ద రాజధానిగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తున్న విషయాన్ని, ఇటీవలే ప్రకటించిన 4170,కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, రూ.205 కోట్లతో మామూనూరు విమానాశ్రయం ఏర్పాటుకు భూ సేకరణ, గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధికి కేటాయించిన 180కోట్ల నిధులు, నూతన మున్సిపల్ భవనానికి 34కోట్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు ల కోసం కేటాయించి వరంగల్ నగరాన్ని కొత్త హంగులు దిద్దుకోవడం పట్ల ప్రజలకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ల ద్వారా ప్రచారం చేయాలనీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు వెంటనే ప్రతి ఒక్క కార్యకర్తకి సముచిత స్థానం గౌరవం దక్కేలా చూసుకుంటానని, ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చేలా చూస్తానని రాజేందర్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సంక్షేమ పథకాల అమలులో దుర్వినియోగం చేస్తే ఎంతటి వారికైనా శిక్షించడంలో ఉపేక్షించేది లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల జోలికి ఎవరైనా వొచ్చినా వారు ఎంతటి వారైనా చట్టరీత్యా శిక్షించేలా చర్యలు తీసుకుంటున్నాని రాజేందర్ రెడ్డి భరోసా ఇచ్చారు.