కరీంనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 24 : లోక్ సభ మాజీ సభ్యుడు గొట్టె.భూపతి సతీమణి గొట్టె శాంత (76) అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు. భూపతి పెద్దపల్లి లోక్ సభ సభ్యునిగా పనిచేయగా, వీరి పెద్ద కుమారుడు సుధీర్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. మరో కుమారుడు సుమన్ బాబు కరీంనగర్ లో న్యాయవాద వృత్తిలో ఉన్నారు. శాంత మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లికి చెందిన భూపతి గత కొంతకాలంగా కరీంనగర్ లో నివాసం ఉంటున్నారు.