సన్నాలను పండిరచేలా ప్రోత్సాహకాలు
క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణలో వరిసాగు విస్తృతంగా జరుగుతున్నదని, కానీ పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధరరాక, పెట్టిన పెట్టుబడి కూడా మిగలక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన ప్రసంగించారు. 33 రకాల వరి పంటలకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణలో వరి సాగు చాలా విస్తృతంగా జరుగుతున్నదని, పండిన పంటకు సరైన ధర రాక, పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించి, వాటిని పండిరచిన రైతుకు క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని నిర్ణయించిందని భట్టి తెలిపారు. దీనివల్ల సన్న రకం వరి సాగు విస్తీర్ణం పెరిగి, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.
బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.72,659 కోట్లు ప్రతిపాదించారు. అదే విధంగా హార్టికల్చర్‌కు రూ.737 కోట్లు, పశుసంవర్ధక రంగానికి రూ.1980 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రంలో 12.12 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటల సాగు ద్వారా 53.06 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఎన్ఎంఈఓ ఓపీ పథకం కింద ఆయిల్ పామ్‌సాగు రైతులకు అవసరమైన సహాయం అందిస్తామన్నారు. 2024`25లో రాష్ట్రంలో లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్గు చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడిరచారు. ఇప్పటికే 77,857 ఎకరాలకి రిజిస్ట్రేషన్ జరుగగా, 23,131 ఎకరాలకి అనుమతులు కూడా ఇచ్చామన్నారు. వొచ్చిన మొత్తం రిజిస్ట్రేషన్లకి ఈ నెలలోనే ప్లాంటేషన్ మరియు డ్రిప్ అనుమతులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పాడిపశువుల పెంపకం గ్రావిూణ ప్రజానీకానికి ఎంతో ఆర్థిక పుష్టిని ఇస్తుంది.
పాలు, మాంసం, గుడ్లు ప్రజానీకానికి పోషణ అందించడంతో పాటు, అదనపు ఆదాయం ఇస్తాయి. ఇతర అనుబంధ రంగాలైన చేపలు, గొర్రెలు, కోళ్ల పెంపకం ఎంతో మందికి జీవనోపాధికల్పిస్తాయి. ఈ రంగం గ్రావిూణ ప్రాంతాలలో ఉపాధి కల్పిస్తూ, అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తుంది. పాల ఉత్పత్తి రంగంలో 62 శాతం వాటా చిన్న, సన్నకారు,భూమిలేని పేదలదే. వారు రాష్ట్రంలోని పశుసంపదలో 70 శాతం వాటా పొంది ఉన్నారు. ఈ రంగంలో రాష్ట్రం 326.39 లక్షల పశుసంపదతో దేశంలో ఎనిమిదో స్థానంలో ఉంది.శుసంవర్ధక రంగానికి ఈ బడ్జెట్లో రూ.1,980 కోట్లు ప్రతిపాదిస్తున్నాం’ అని చెప్పారు.