విభజన హామీలు నెరవేర్చండి

ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ ఎం‌పీలు లేఖ

న్యూదిల్లీ,జూలై25: విభజన హామీలు నెరవేర్చాలని  ప్రధాని మోదీకి తెలంగాణ కాంగ్రెస్‌ ఎం‌పీలు గురువారం లేఖ రాశారు. కేంద్ర  బడ్జెట్‌  ‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం.. ఐటీఐఆర్‌, ఐఐఎం,  ‌బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట్‌ ‌రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ, తెలంగాణలోని మేజర్‌  ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులకు జాతీయ హోదా, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాపై  బడ్జెట్‌ ‌లో ప్రస్తావనే లేదన్నారు. తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలో తొమ్మిది జిల్లాల్లో వెనకబడని ప్రాంతాలు చాలా ఉన్నాయి..

 

వాటి అభివృద్ధికి నిధుల విషయంలో తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ కాంగ్రెస్‌ ఎం‌పీలు ఈ లేఖలో తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధప్రదేశ్‌ ‌కు నిధులు కేటాయించారు. అదే తెలంగాణకు తీరని అన్యాయం చేశారని కాంగ్రెస్‌ ఎం‌పీలు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ‌కు నిధులు ఇవ్వడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. కానీ తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడం చాలా అన్యాయం అన్నారు.

తెలంగాణలో ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని, విభజన హాలను నెరవేర్చాలని  బడ్జెట్‌ ‌కు ముందు సీఎం రేవంత్‌ ‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క చాలా సార్లు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిశారు. అయినప్పటికీ కేంద్ర  బడ్జెట్‌ ‌లో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులను కూడా కేటాయించలేదని కాంగ్రెస్‌ ఎం‌పీలు లేఖలో తెలిపారు. ప్రధాని మోదీ స్పందించి విభజన హాలను నేరవేర్చాలని.. తెలంగాణకు నిధులు కేటాయించాలని లేఖలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎం‌పీలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page