– చిన్నారులకు పోలియో చుక్కలకు ఏర్పాట్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ ఆదివారం పల్స్ పోలియో నిర్వహించనున్నారు. అయిదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు. పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని నవజాత శిశువులు మొదలుకుని 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆదివారం బూత్ లలో పోలియో డ్రాప్స్ వేస్తారు. 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగతా చిన్నారులకూ పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండటంతో జులై 1న అదనంగా మరో రోజు కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి దామోదర్ ఇప్పటికే ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఒక్కరు కూడా మిగలకుండా బూత్ లు, మొబైల్ బృందాలు, ఇంటింటి సర్వేల ద్వారా పోలియో డ్రాప్స్ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వలస కార్మికుల పిల్లలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లోని బస్తీలు, కొత్త కాలనీలు,, గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





