బడ్జెట్ ప్రసంగం ఆర్థిక మంత్రి భట్టి వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్రంలో భూమిలేని గ్రావిూణ ప్రజానీకం ఎక్కువగా రైతు కూలీలుగా జీవనం గడుపుతోందని, వారికి ఎలాంటి ఆర్థిక భత్రత లేకపోవడంతో పనిదొరకని రోజుల్లో పస్తులు ఉండాల్సి వస్తున్నదని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
గ్రావిూణ ప్రాంతాల్లో చాలా మందికి సొంత భూములు లేవని, దాంతో వాళ్లు రైతు కూలీలుగా జీవనం గడుపుతున్నారని ఆర్థిక మంత్రి చెప్పారు. వారి జీవితాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. అందుకే భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సాయాన్ని ఈ సంవత్సరమే ప్రారంభిస్తామని చెప్పారు.