విచారణను ఆగస్ట్1కి వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై మంగళవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేప్టటింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ నేతలు పిటిషన్ వేశారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు ..తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విధంగా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు పిటిషనర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలపై ఏలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు గండ్ర. సుప్రీమ్ కోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను ప్రస్తావించగా.. తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా వేసింది హైకోర్టు.