నిజామాబాద్‌కు పంగనామాలు

– ఇచ్చిన హామీలను పట్టించుకోని రేవంత్
– తలెత్తుకోలేకపోతున్న పీసీసీ చీఫ్
– ఎంపీ అరవింద్ విమర్శలు

నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 18: నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారని స్థానిక ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు, భూగర్భ డైనేజీ హామీలు ఏమయ్యాయ‌న్నారు. ఈ హామీలు నెరవేర్చకపోవడంతో పీసీసీ చీఫ్ తతెత్తుకోలేకపోతున్నారన్నారు. నిజామాబాద్‌లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను రాజకీయంగా అణగదొక్కేందుకే జిల్లాకు మొండిచేయి చూపారని విమర్శించారు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఈ జిల్లాలో ఆయ‌న‌ తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఇందూరు ప్రజలను మోసం చేస్తే బుద్ధి చెబుతారన్నారు. దేవుళ్లను మోసం చేసిన వాడికి ప్రజలను మోసం చేయటం లెక్క కాదని ఎంపీ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నగరంలో అండర్ గ్రౌండ్ డైనేజీ పనులు పూర్తికావని కుండ బద్దలు కొట్టారు. ఇప్పటివరకు 25 శాతం పనులు కూడా పూర్తి కాలేదన్నారు. రూ.162 కోట్లకు గాను రూ.10 కోట్ల నిధులు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందన్నారు. 2039 వరకు రాహుల్ ప్రధాని కారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారంటే రాహుల్ ఇక ప్రధాని కాలేరని వ్యాఖ్యానించారు. తద్వారా ఇంకో పదేళ్లు దేశంలో బీజేపీ ఉంటుందని సీఎం ఒప్ప్పుకున్నారన్నారు. రేవంత్ రెడ్డికి బదులు కోమటిరెడ్డి వంటి జెన్యూన్ పర్సన్‌ను ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ అగ్రనేతలకు ఎంపీ అరవింద్ సూచించారు. బుల్లెట్ రైల్ కారిడార్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పట్టణాన్ని అప్‌గ్రేడ్ చేస్తానని ప్రకటించిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌నే ప్రజలు నమ్మలేదని, ఇక లేని ఫ్యూచర్ సిటీ అంటే నమ్ముతారా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *