క్యాబినేట్ ర్యాంక్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 6 : మాజీ ఎంపీ, సీనియర్ నేత కే.కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ లీడర్‌గా, కేసీఆర్‌కు సన్నిహితుడిగా కొనసాగిన కేకే…ఈ మధ్యే ఎఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేకే కూతురు జిహెచ్ఎంసి మేయర్ గా ఉన్న గద్వాల్ విజయలక్ష్మి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. కెకె రాజ్యసభ ఎంపీగా తన పదవీకాలం ఇంకా రెండేండ్లు మిగిలి ఉండగానే రాజీనామా చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యానని…ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశానని తెలిపారు.