ఏఐసీసీ డైరెక్షన్‌ ‌మేరకే చేరికలు

ఫిరాయింపులకు వ్యతిరేకమైనా అనివార్యం
దళితులకు వ్యతిరేకంగా మోదీ, కేసీఆర్‌ ‌కుట్రలు
మాజీ ఎంపి, కాంగ్రెస్‌ ‌నేత మధుయాష్కీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : ఏఐసీసీ డైరెక్షన్‌ ‌మేరకే చేరికలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత మధుయాష్కీగౌడ్‌ అన్నారు. పార్టీ ఫిరాయింపులకు పార్టీ వ్యతిరేకమైనా తెలంగాణలో అనివార్య మైందని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వస్తాం అనుకున్నామని చెప్పారు. మంత్రి పదవులు ఇస్తామని ఎవరికీ చెప్పలేదని అన్నారు. కాంగ్రెస్‌ ‌గెలిచిన మూడు రోజులకే సర్కార్‌ ‌కూలిపోతుందని బీఆర్‌ఎస్‌ ‌నేతలు అన్నారని గుర్తుచేశారు. కేసీఆర్‌ అహంకారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని అన్నారు. అంబేద్కర్‌ ‌పేరువి•దున్న ప్రాణహిత చేవెళ్లను కాదని కాళేశ్వరం కట్టారని చెప్పారు. దళిత నేత భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు ఆ హోదా పోయేలా కేసీఆర్‌ ‌చేశారని మండిపడ్డారు.

సోమవారం గాంధీభవన్‌లో మధుయాష్కీ వి•డియాతో మాట్లాడుతూ.. దళితులకు వ్యతిరేకంగా మోదీ, కేసీఆర్‌ ‌పనిచేశారని ధ్వజమెత్తారు.తాము ఎమ్మెల్యేలను పైసలిచ్చి కొనుకోవడం లేదని స్పష్టం చేశారు. వేరే పార్టీలో గెలిచిన వారికి బీజేపీ ఇతర రాష్టాల్ల్రో మంత్రి పదవులు ఇస్తుందని చెప్పారు. పీసీసీ చీఫ్‌ ఎం‌పికపై ఢిల్లీలో అసలు చర్చ జరగలేదు. మంత్రి వర్గ విస్తరణపై జరిగింది. ఎవరెవరికి మంత్రి పదవులివ్వాలి. ఏ శాఖలు ఇవ్వాలనేదానిపై చర్చ జరిగింది. అదేరోజు పీసీసీపై ఐదు నిమిషాలు చర్చించి పక్కకు పెట్టారు. కొందరు మంత్రులు కూడా తమకు సరైన శాఖలు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. మంత్రులపై సమన్వయం చేసే దానిపై చర్చ జరిగింది. కార్పొరేషన్‌ ‌చైర్మన్ల నియామకంలో ఇన్‌చార్జి దీపాదాస్‌ ‌మున్షీ పాత్ర ఏమి లేదు. కార్పొరేషన్‌ ‌చైర్మన్ల విషయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రులు శ్రీదర్‌ ‌బాబు, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులు కేసుల నుంచి తప్పించాలని కోరుతున్నారు. దానికి ప్రతిఫలంగా రూ.100 కోట్లు ఇస్తామని తిరుగుతున్నారు.

ప్రభుత్వంలోని కొందరు పెద్దల చుట్టూ అవినీతి అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కేసీఆర్‌ ‌తప్పు చేయకపోతే కమిషన్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లారని మధుయాష్కీ తెలిపారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో 50 ఏళ్లకు పైగా ఉన్నాను. నేను ఏ పార్టీ మారలేదు. మొదటి నుంచి కాంగ్రెస్‌ ‌పార్టీలోనే ఉన్నాను. ఎమ్మెల్సీ కవిత విడుదలపైనే బీఆర్‌ఎస్‌ ‌ఫోకస్‌ ‌పెట్టింది. కవిత విడుదల కోసం బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌పార్టీలను మెర్జ్ ‌చేయాలని కేసీఆర్‌, ‌కేటీఆర్‌ ‌చూస్తున్నారు. దానిపై ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్‌ ‌రావుపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌ప్రేమ ఒలకపోయాడానికి అదే కారణం.

బీఆర్‌ఎస్‌ ‌పార్టీ విలీనంపై కేంద్ర బీజేపీ ఒకే చెబుతున్నా, స్టేట్‌ ‌బీజేపీ నేతలు వద్దంటున్నారు. అవసరమైతే కొందరు బీఆర్‌ఎస్‌ ‌నేతలను పార్టీలో చేర్చుకోవాలని జాతీయ బీజేపీ నాయకులు అంటున్నారు‘ అని మధుయాష్కీ తెలిపారు. కేసీఆర్‌ ‌మంత్రులకు కూడా అపాయింట్మెంట్‌ ఇవ్వలేదు. గతంలో హోం మంత్రి మహమ్మద్‌ అలీ ప్రగతిభవన్‌కు పొతే హోం గార్డుతో వెనక్కి పంపించారు. ప్రజలు విసిగి వేసారిపోయి కాంగ్రెస్‌ ‌పార్టీకు అధికారం ఇచ్చారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్‌ ‌సీఎం అయితే కేసీఆర్‌ ఓర్వడం లేదు.రేవంత్‌పై అసూయతో కుట్ర చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్‌, ‌నేను చాలా కష్టపడ్డాం. నేను నేరుగా అమెరికా నుండి వొచ్చి ఎన్నికల్లో పోటీ చేయలేదు. నేను విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నాను‘ అని మధుయాష్కి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page