- హిందీ పాత్రికేయులకు సమాన ప్రాతినిధ్యం
- తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి
హిందీ పాత్రికేయులకూ సమాన ప్రాతిన్యిం కల్పిస్తామని, భాషా ప్రాతిపాదికన వివక్ష ఉండబోదని తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ హిందీ జర్నలిస్టస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ హిందీ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కొత్తతరం పిల్లలు అందరూ హిందీ మాట్లాడుతారని అన్నారు. తెలంగాణ హిందీ జర్నలిస్టస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఎన్‌ఎస్ కుమార్ మాట్లాడుతూ జాతీయ భాష అయిన హిందీకి చెందిన జర్నలిస్టులకు కూడా ఇతర భాషా జర్నలిస్టులతో సమానంగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అందుకు శ్రీనివాస్ రెడ్డి పూర్తి హామీ ఇస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం పాత్రికేయులను భాషా ప్రాతిపాదికన చూడదని, భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరిగితే తానే ముందుంటానని నొక్కి చెప్పారు.
పాత్రికేయులకు ఇండ్ల స్ధలాల కేటాయింపుతో పాటు అక్రిడిటేషన్ల మంజూరీ, మెడికల్ ఇన్సూరెన్స లాంటి అన్ని ప్రభుత్వ పథకాలు కూడా అర్హులైన హిందీ జర్నలిస్టులందరికీ అందేట్లు చూసే బాధ్యత తనదే నన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో కూడా హైదరాబాద్ లోపాత్రికేయులకు ఇండ్ల స్థలాలను కేటాయించిందని, అప్పటి సీఎం వైఎస్‌ఆర్ కేటాయించిన 70 ఎకరాల భూమిలో కోర్టు వివాదాలతో మిగిలిపోయిన 38 ఎకరాలు, 18 ఏండ్ల తరువాత ప్రస్థుత సీఎం కాంగ్రస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలే జెఎన్జేహౌసింగ్ సొసైటీకి స్వాధీన చేయాలంటూ మెమో జారీ చేశారన్నారు. త్వరలో మరో 3 వేల మందికి పైగా హైదరాబాద్ జర్నలిస్టులకు కూడా ఫ్యూచర్ సిటీలలో ఇండ్లస్థలాలు ఇస్థామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని అన్నారు.
అయితే దానకి కావలసిన నియమ, నిబంధనలు తదితర మార్గదర్శకాలు రూపకల్పన దశలో ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ లో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికి, బాషా భేధం లేకుండా నివాస స్థలాలు లభిస్థాయని ఆయన హామీ ఇచ్చారు. హిందీ కవులు, పాత్రికేయులను, ఉపాధ్యాయులను హిందీ దినోత్సవం నాడు సన్మానించడం శ్లాఘనీయమని మాజీ కేంద్ర మంత్రి ఎస్.వేణుగోపాలా చారి అన్నారు. టీయూడబ్లుయుజే అధ్యక్షుడు విరాహత్ అలీ మాట్లాడుతూ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఇతర భాషా జర్నలిస్టులకు మాదిరిగానే హిందీ భాషా జర్నలిస్టులకూ వృత్తి మెలకువలకు సంబంధించిన వర్కషాప్ లు నిర్వహించాలని కోరారు.