వరంగల్‌ కు గాలిమోటరూ, గాలి మాటలూ!

ఎట్టకేలకు వరంగల్‌ (మామునూరు) విమానా శ్రయం కదలిక ప్రారంభమయింది. రాష్ట్రంలో హైదరా బాద్‌ (శంషాబాద్‌) అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత రెండో విమానాశ్రయంగా వరంగల్‌ విమానా శ్రయం రాబోతున్నది. నిజానికి రెండో ప్రపంచ యుద్ధ కాలానికి ముందే 1930లలో నిర్మాణమైన ఈ విమానాశ్రయం ఇరవయో శతాబ్ది తొలి అర్ధభాగంలో దేశంలో ప్రధానమైన విమానాశ్రయాల్లో ఒకటిగా ఉండిరది. అది నాలుగు దశాబ్దాలుగా విమానాల రాకపోకలు లేక జీవచ్ఛవంగా ఉండిపోయింది. దాన్ని ఇప్పుడు పునర్నిర్మించి, మెరుగుపరిచి,పౌర విమాన యానానికి అనువుగా చేయదలిచారు.

ఒక ఊరికి కొత్తగా గాలిమోటర్‌ సౌకర్యం రావడం సంతోషించదగిన విషయమే గాని, దానివల్ల ప్రయోజనం దక్కేదెవరికి అనేది కీలకమైన ప్రశ్న. ప్రభుత్వం మహా ఆర్భాటంగా ‘‘అభివృద్ధి’’గా గొప్పలు చెపుతూ ప్రవేశపెట్టేవన్నీ చిట్టచివరికి ఏ పిడికెడు మంది ప్రయోజనాల దగ్గరో ఆగిపోవడం మనం అనుక్షణం చూస్తున్న సంగతే. వరంగల్‌ నగరం పది లక్షల జనాభాకు గాని,ఉమ్మడి వరంగల్‌ జిల్లా నలబై లక్షల జనాభాకు గాని, వరంగల్‌ పారిశ్రామిక, సేవా, పర్యాటక రంగ అభివృద్ధికి గాని,భూమిపుత్రుల ఉద్యోగకల్పనకు గాని ఈ విమానాశ్రయం ఎంతవరకు ఉపయోగపడుతుందన్న చర్చ జరగవలసిన, ప్రణా ళికలు రచించవలసిన సందర్భంలో, ఆ చర్చను పక్కకు తోసేస్తూ మరొక చర్చ జరుగుతున్నది. రాజకీయ పక్షాల మధ్య గాలి మాటల యుద్ధం జరుగుతున్నది. అబద్ధాల, అర్ధసత్యాల విమానాలు రివ్వురివ్వున దూసుకుపోతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర సమితిది ఇంకా విచిత్రమైన స్థితి. వారు పాలించిన పది సంవత్సరాలలో స్వయంగా ముఖ్యమంత్రి,ఆయన కొడుకు ఎన్నోసార్లు కొత్త విమానాశ్రయాల గురించి ప్రకటనలు చేశారు. కనీసం అరడజను సార్లు నేనే వేరువేరు సందర్భాలలో ఆ ప్రకటనలు రాగానే అది ఎంత పచ్చి అబద్ధమో రాశాను. ఆ కన్సెషన్‌ అగ్రిమెంట్‌ లోని నిబంధన తొలగించకుండా 2033 మార్చ్‌ వరకు ఇంకొక విమానాశ్రమ గురించి ఆలోచించే అవకాశమే లేదు. కాని తెలంగాణాధీశులు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి పదేపదే కొత్త విమానాశ్రయాల గురించి శాసనసభా వేదిక మీద, ఆయా ప్రాంతాలలోనూ ప్రకటనలు చేశారు. కనీసం ‘ఈ ప్రకటన నిజం కావాలంటే ఒక అడ్డంకి ఉంది,దాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాము’ అనే మాట కూడా ఎప్పుడూ అనలేదు.

కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీ, భారత రాష్ట్ర సమితి- ఈ నాలుగు పార్టీలూ మామునూరు విమానాశ్రయం మేం తెచ్చిందే అంటే మేం తెచ్చిందే అని సవాళ్లువిసురుకుంటున్నారు. ఈ విమానాశ్రయ పునరుద్ధరణ ప్రయ త్నాలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో ప్రారంభమవుతున్నాయి గనుక అది తమ ఖాతాలోకే రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అంటున్నారు. తన ప్రభుత్వం 2024 నవంబర్‌లో ఈ విమానా శ్రయానికి అదనంగా కావలసిన 253 ఎకరాల భూసేకరణ కోసం రు.205 కోట్లు కేటాయించిందని. తానే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ విమానాశ్రయం సాధించానని ఆయన అంటు న్నారు. ఈ విమానా శ్రయాన్ని కొచ్చి విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేయాలని, దాని అభివృద్ధి పని తీరును తాను ప్రతి నెలా సమీక్షిస్తానని కూడా అన్నారు.

విమానాశ్రయ పునరుద్ధరణ ప్రయత్నాలు మొదలయ్యాయని వార్తలు రాగానే గత శనివారం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మామునూరులో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ఆ ఘనతంతా తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించగా, అక్కడికి దూసుకు వెళ్లిన కాంగ్రెస్‌ కార్యకర్తలు అక్కడ రేవంత్‌ రెడ్డి చిత్రపటం పెట్టడానికి ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్యా తోపులాట జరిగిందని కూడా వార్తలు వచ్చాయి. తాము కేంద్ర ప్రభుత్వంలో అది óకారంలో ఉన్న ప్పుడు, తమ కేంద్ర పౌర విమా నయాన మం త్రిత్వ శాఖ ఈ ఆమోదం తెలిపి ందిగనుక, విమా నాశ్రయ అబి óవృద్ధికి నరేం ద్ర మోదీ ప్రభుత్వం రు. 450 కోట్ల సహాయం ప్రక టించింది గనుక ఈ ఘనత తమకే దక్కాలని భార తీయ జనతా పార్టీ వాదిస్తున్నది. ఆ పార్టీ కార్యకర్తలు ఎంత చురుగ్గా ఉన్నారంటే ఫిబ్రవరి 28న ప్రభుత్వ అనుమతి వచ్చిందో లేదో, మర్నాడే మామునూరు విమానా శ్రయందగ్గర ప్రధాని చిత్ర పటానికి పుష్పాభిషేకం, పాలాభిషేకం, హాజరైన వారికి పళ్లూ, మిఠాయిలూ పంపిణీ చేసి, ఆ ఘనతంతా తమ ఖాతాలోకే వేసుకోవడానికి ప్రయత్నించారు.

ఇప్పుడు స్వయంగా జిఎంఆర్‌ ఈ నిబంధనను ఈ ఒక్కసారి మామునూరు కోసమే ఉపసంహరించుకుంటున్నాను అని ‘అభ్యంతరం లేదు’ అని ధృవీకరణ పత్రం ఇచ్చింది. అక్కడా కూడా, ఇది ఒక్క మామునూరు కోసం మాత్రమే, ఈ ఉపసంహరణను ఇక ముందు ఇతర విమానాశ్రయాలకు వాడుకోగూడదు అని కూడా సన్నాయి నొక్కు నొక్కింది. అందువల్ల మామునూరు ముందుకు కదులుతున్నది. అయితే అలా అడ్డంకిని ఉపసంహరించుకుంటున్నాము, మాకు అభ్యంతరం లేదు అంటున్న జిఎంఆర్‌ సంస్థకు కూడా క్రెడిట్‌ ఇవ్వడానికి వీలు లేదు.

ఈ వ్యవహారంలో తానేమీ తక్కువ తినలేదన్నట్టుగా తెలుగు దేశం పార్టీ కూడా, ఈ అనుమతి ఇచ్చిన పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి కె రామమోహన నాయుడు తమ పార్టీకి చెందినవాడు గనుక వరంగల్‌ విమానాశ్రయానికి ఆమోదం తెలిపిన ఘనత తమకే దక్కాలని అంటున్నారు.
తెలంగాణాను గత పది సంవత్సరాలు పాలించిన తెలంగాణ – భారత రాష్ట్ర సమితి నాయకులు కూడా ఆ పది సంవత్సరాలలో తాము చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఈ నిర్ణయం జరిగిందని,కనుక ఆ ఘనత తమదేనని వాదించడం ప్రారంభించారు. కెసిఆర్‌ కృషితోనే విమానాశ్రయం సాకారమయిందని, దిల్లీలో కూచుని తాను తెచ్చానని రేవంత్‌ రెడ్డి ప్రకటించడం తెలంగాణ ప్రజలకు అవమానం అని కూడా బిఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు.

మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ ఎవరి ఘనత అని ఇలా అన్ని రాజకీయ పక్షాలు ఘర్షణ పడుతుండగా,వాస్తవమేమంటే అన్ని పార్టీల ప్రకటనలూ అబద్ధాలు,అర్ధసత్యాలు మాత్రమే. ఇప్పుడు మామునూరు విమానాశ్రయంఎవరివల్ల పునరుద్ధరణ జరుగుతున్నదనే విషయం అలా ఉంచి,ఇన్నాళ్లూ పునరుద్ధరణ కాకుండా ఉండడంలో మాత్రం ఈ అన్ని పార్టీలకూ భాగం ఉంది. మొట్టమొదట, హైదరాబాద్‌ లో అప్పటికి ఉన్న బేగంపేట విమానాశ్రయం సరిపోవడంలేదని, అందు వల్ల కొత్త విమానాశ్రయం కావాలని ఆలోచ నలు మొదలై, ఆ ప్రక్రియ ప్రారంభించినప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్‌ చేతిలోనే ఉన్నాయి. విమా నాశ్రయ నిర్మాణ టెండర్లు జిఎంఆర్‌ గెలుచుకున్నది. విమానాశ్రయాన్ని నిర్మించడానికి, నిర్వహిం చడానికి జిఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నే షనల్‌ ఎయిర్పోర్ట్‌ లిమిటెడ్‌ అనే ప్రత్యేక సంస్థ ఏర్పడిరది. అందులో 63 శాతం వాటాతో జిఎంఆర్‌, 13 శాతం వాటాతో ఏర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, 13 శాతం వాటాతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (అప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం), 11 శాతం వాటాతో మలేషి యా ఏర్‌ పోర్ట్స్‌ హోల్డి ంగ్స్‌ బెర్హాడ్‌ లు ఉన్నా యి. ఈ సంస్థకూ కేంద్ర ప్రభుత్వ పౌర విమాన యాన శాఖకూ మధ్య 2004 డిసెంబర్‌ 20న ఒక ఒప్పందం మీద సంతకాలు జరిగాయి. మాము నూరు విమా నాశ్రయం ఇప్పటి దాకా సాకారం కాకపో వడానికి కీల కమైన అడ్డంకి ఈ ఒప్పం దంలో ఉంది.

మామునూరు విమానాశ్రయంలో శిథిలమైన అద్దాల మేడ
నిజానికి ఇది నలుగురు భాగ స్వాముల మధ్య సమాన స్థాయిలో కుదిరిన ఒప్ప ందం కాదు. 26 శాతం వాటా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, తమ అధికారాలనూ, హక్కులనూ తామే స్వచ్ఛందంగా వదులు కుంటూ, 63 శాతం వాటాదారు అయిన జిఎంఆర్‌ కు దాసోహం అంటూ రాసి ఇచ్చిన పత్రం అది. ప్రభుత్వాలు ఒక కార్పొరేట్‌ సం స్థకు ఇచ్చిన రాయితీల ప్రకటన అది. కన్సెషన్‌ అగ్రిమెంట్‌ అనబడే ఆ పత్రంలో క్లాజ్‌ 5.2.1., క్లాజ్‌ 5.2.2.అనేవి మామునూరు విమానాశ్రయానికీ, తెలంగాణలో రానున్న, రావలసిన అనేక విమా నా శ్రయాలకూ ప్రధాన అడ్డంకి.
ఆ నిబంధన ప్రకారం హైదరాబాద్‌ విమానాశ్రయం ప్రారం భమైన తేదీ నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు 150 కి.మీ. వాయు పరిధిలో ఏ కొత్త అంతర్జాతీయ, జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయబోనని, ఉన్నదాన్ని మెరుగు పరచబోనని, ఉన్నదాని స్థాయి మార్చబోనని కేంద్ర ప్రభుత్వం జిఎంఆర్‌ కు లొంగుబాటు వాగ్దానం చేసింది. శంషాబాద్‌ విమానాశ్రయం 2008 మార్చ్‌ 23న ప్రారంభమైంది గనుక 2033 మార్చ్‌ 22 వరకు ఈ ఆంక్ష వర్తిస్తుంది. తెలంగాణలో ఆరు విమానా శ్రయాలు నిర్మించడానికి అవకాశం ఉందని అధికార పక్షాలన్నీ దశాబ్దాలుగా అంటున్నాయిగాని ఈ నిబంధన వల్ల వాటికి వీలు లేదు. అలా ప్రతిపాదిస్తున్న వాటిలో నాలుగు ఈ 150 కిమీ పరిధిలోకి వస్తాయి. మహబూబ్‌ నగర్‌ (గుడిబండ) 124 కిమీ, వరంగల్‌ (మామునూరు) 132 కిమీ,నిజామాబాద్‌ (జక్రాన్‌ పల్లి) 153 కిమీ, కరీంనగర్‌ (బసంత్‌ నగర్‌) 178 కిమీ దూ రంలో ఉండడం వల్ల విమానాశ్రయ ఆలోచనలు వచ్చినవి కూడా వాస్తవరూపం ధరించే అవకాశం లేకపోయింది. ఆది లాబాద్‌, కొత్తగూడెం ప్రతిపాదనలు మాత్రమే ఈ పరిధికి బైట ఉన్నాయి గనుక అవి మాత్రమే రావడానికి అవకాశం ఉండిరది.

ఒకవైపు కొత్తగా 150 కిమీ పరిధి నిబంధనను తొలగించినప్పటికీ,అంతకు ముందే కుదిరిన ఒప్పందాలలో ఆ నిబంధనను సమీక్షించడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రయత్నించలేదు. కనీసం ఆయా ఒప్పందాలు కుదిరిన వారితో మినహాయింపు ఇమ్మని సంప్రదింపులు కూడా జరపలేదు. ఇప్పుడు తామే ఈ విమానాశ్రయం తెచ్చామని చెపుతున్నవారు,పదకొండు సంవత్సరాలుగా ఆ అవకాశం ఉన్నప్పటికీ ఆ పని చేయలేదనేది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

ఈ దుర్మార్గమైన, అవమానకరమైన, ప్రజా వ్యతిరేకమైన, తన హక్కు లను తానే వదులుకునే ఒప్పందపత్రం రాసి ఇచ్చిన పాపం అప్పుడు కేంద్ర, రాష్ట్ర అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీదే. అయితే, ఒప్పందంలో ఈ నిబంధన చేరడానికి కారణం, అప్ప టికి ఉన్న పౌర విమానయాన విధానం. ప్రపంచీకరణ విధానాల తర్వాత,కొత్త విమానాశ్రయాల అభివృద్ధి కోసం కార్పొరేట్లకు ఇటువంటి రాయి తీలు ఎడాపెడా ఇచ్చే విధా నం ఉండిరది. ఇది కాంగ్రెస్‌ పాపం అన్నం దువల్ల, మిగిలిన మూడు పార్టీలూ పుణ్యాత్ములు అయిపోరు. ఆ సంగతి కూడా చూద్దాం. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే పాత పౌరవిమానయాన విధానాన్ని మార్చింది. 150 కిమీ పరిధిలోపల కొత్త విమానాశ్రయాలకు అనుమతి ఇవ్వకపోవడం అనే నిబంధన అవ సరం లేదని తొలగించింది. కనుక ఆ తర్వాత కుదిరిన ఒప్పం దాలలో ఆ నిబంధన లేదు. అయితే దేశంలోని అనేక విమానా శ్రయాలను గౌతమ్‌ అదానీ హక్కు భుక్తం చేయడానికి బారతీయ జనతా పార్టీ ఏయే అక్రమాలు చేసిందో అందరికీ తెలుసు.ఒకవైపు కొత్తగా 150 కిమీ పరిధి నిబంధనను తొలగించి నప్పటికీ, అంతకు ముందే కుదిరిన ఒప్పం దాలలో ఆ నిబంధనను సమీక్షిం చడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రయత్నించలేదు.

కనీసం ఆయా ఒప్పందాలు కుదిరిన వారితో మినహాయింపు ఇమ్మని సంప్ర దింపులు కూడా జరపలేదు. ఇప్పుడు తామే ఈ విమానాశ్రయం తెచ్చా మని చెపుతున్న వారు, పదకొండు సంవత్సరాలుగా ఆ అవకాశం ఉన్నప్పటికీ ఆ పని చేయలేదనేది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.ఇక తెలుగు దేశం పార్టీకి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రావడం యాదృచ్చికమే తప్ప అదేదో వారికి ప్రత్యేకంగా అందినది కాదు. అది పూర్తి మంత్రివర్గ ఆమోదం లేకుండా ఒక మంత్రి తీసుకోగలిగిన స్వతంత్ర నిర్ణయమూ కాదు. కనుక ఈ నిర్ణయం తమ వల్లనే జరిగిందని తమ ఖాతాలో వేసుకోవడానికి తెలుగు దేశం పార్టీకి ఎటువంటి అర్హతా లేదు.

తెలంగాణ రాష్ట్ర సమితిది ఇంకా విచి త్రమైన స్థితి. వారు పాలించిన పది సంవత్సరాలలో స్వయంగా ముఖ్యమంత్రి,ఆయన కొడుకు ఎన్నోసార్లు కొత్త విమానాశ్రయాల గురించి ప్రకటనలు చేశారు. కనీసం అరడజను సార్లు నేనే వేరువేరు సందర్భాలలో ఆ ప్రకటనలు రాగానే అది ఎంత పచ్చి అబద్ధమో రాశాను. ఆ కన్సెషన్‌ అగ్రిమెంట్‌ లోని నిబంధన తొలగించకుండా 2033 మార్చ్‌ వరకు ఇంకొక విమానాశ్రమ గురించి ఆలోచించే అవకాశమే లేదు. కాని తెలంగాణాధీశులు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి పదేపదే కొత్త విమానాశ్రయాల గురించి శాసనసభా వేదిక మీద, ఆయా ప్రాంతాల లోనూ ప్రకటనలు చేశారు.

కనీసం ‘ఈ ప్రకటన నిజం కావాలంటే ఒక అడ్డంకి ఉంది,దాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాము’ అనే మాట కూడా ఎప్పుడూ అనలేదు. ఇప్పుడు స్వయంగా జిఎంఆర్‌ ఈ నిబంధనను ఈ ఒక్కసారి మామునూరు కోసమే ఉపసంహరించు కుంటున్నాను అని ‘అభ్యంతరం లేదు’ అని ధృవీకరణ పత్రం ఇచ్చింది. అక్కడా కూడా, ఇది ఒక్క మాము నూరు కోసం మాత్రమే, ఈ ఉపసం హరణను ఇక ముందు ఇతర విమానాశ్రయాలకు వాడుకోగూడదు అని కూడా సన్నాయి నొక్కు నొక్కింది. అందువల్ల మామునూరు ముందుకు కదులుతున్నది. అయితే అలా అడ్డంకిని ఉపసంహరి ంచుకుం టున్నాము, మాకు అభ్యంతరం లేదు అంటున్న జిఎంఆర్‌ సంస్థకు కూడా క్రెడిట్‌ ఇవ్వడానికి వీలు లేదు. ఒక ప్రభుత్వ నిర్ణయం ఒక కార్పొరేట్‌ సంస్థ అభ్యం తరం లేదని అన్నాక మాత్రమే జరుగు తున్నదంటే, ఈ దేశాన్ని పాలిస్తున్నది ఎన్నికైన ప్రభుత్వాలా లేక కార్పొరేట్లా అనే ప్రశ్న మిగిలే ఉంటుంది. ప్రజా జీవనం మీద సంపూర్ణ అధికారం ఉన్న ప్రభుత్వం, తన అధికారాన్ని కార్పొరేట్లకు దఖలు పరిచి, ఆ కార్పొరేట్లు దయతలచి ఒకటి రెండు అధికారాలను వదులుకుంటే, అప్పుడు మాత్రమే ప్రభుత్వం తన పటాటోపం చలాయిస్తుందన్నమాట! ఆ పటాటోపం మాదంటే మాదని రాజకీయపక్షాలు గద్దల్లా కొట్లాడుకుంటాయన్నమాట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page