తెలంగాణ భూమిపుత్రులది, ఎవరి జాగీరూ కాదు!

“తెలంగాణ వారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎందుకు” అని స్వయంగా పవన్ కళ్యాణ్ అన్న మాటను ఆయన పార్టీ నాయకులు అనేక మంది పునరుక్తం చేశారు. ఎవరి స్థాయిలో వారు, ఎవరి సంస్కారాన్ని బట్టి వారు బూతులు, తిట్లు, దుర్భాషలు జోడించారు. నాగేశ్వర్ ను వ్యక్తిగతంగా తూలనాడారు. సామాజిక మాధ్యమాలలో, యూట్యూబ్ ఛానళ్లలో నాగేశ్వర్ మీద, అవకాశం దొరికింది గదా అని తెలంగాణ మీద విద్వేషం వెళ్లగక్కడం ప్రారంభించారు. ఈ దాడిలో వెనుకబడిపోతున్నామని భావించిన తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా రంగంలోకి దిగి వారి సంస్కారాన్ని కూడా చూపుకున్నారు. ఒక తెలుగుదేశం రాష్ట్ర స్థాయి నాయకుడు, “తెలంగాణ అనే మాట ఎక్కడుంది? డిక్షనరీలో వెతికాను. ఆ మాటే లేదు” అని మొత్తం తెలంగాణ సమాజం పట్లనే అవమానకరమైన వ్యాఖ్య చేశాడు.”

సవాలు వచ్చినప్పుడే సత్తా తెలుస్తుంది. నిలదీసినప్పుడే నిగ్గు తేలుతుంది. ఏదైనా లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. అనేకసార్లు చెప్పిన, చర్చించిన, నిర్ధారించిన విషయమే అయినా మళ్లీ మళ్లీ చెప్పినప్పుడే అది పరిపుష్టమవుతుంది. తెలంగాణ అంటే ఏమిటి, తెలంగాణ జనజీవన స్వభావం ఏమిటి, తెలంగాణ అస్తిత్వాన్ని ఎలా చూడాలి, తెలంగాణ ఎవరిది అని తెలంగాణ సమాజం ఎన్నోసార్లు చెప్పిన విషయాలనే ఇప్పుడు మళ్లీ ఒకసారి చెప్పవలసిన సందర్భం తలెత్తింది. హైదరాబాద్ నడిబొడ్డున ఒక పొరుగు రాష్ట్రపు రాజకీయ నాయకుడు ‘తెలంగాణ మీ అయ్య జాగీరా’ అని తెలంగాణ సమాజాన్ని ప్రశ్నించినప్పుడు, ఇక తప్పదు, తెలంగాణ సమాజం మళ్లీ ఒకసారి లేచి నిలిచి జవాబు చెప్పవలసి ఉంది. ఆ ప్రశ్న ఆ నాయకుడిది మాత్రమే కాదు, అది తెలంగాణ సమాజంలో విష విద్వేష విభజన రాజకీయాలు నాటదలచుకున్న సంఘ్ పరివార్ కుట్రలది. అది రానున్న జి హెచ్ ఎం సి ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ రచిస్తున్న ముందస్తు వ్యూహానిది. పవన్ కళ్యాణ్ నోట్లోంచి వెలువడుతున్న అమిత్ షా ప్రశ్న అది. బహిరంగంగా కాంగ్రెస్ ప్రభుత్వంగా, ప్రచ్ఛన్నంగా సంఘ్ ప్రభుత్వంగా, అమిత్ షా అనుచర ప్రభుత్వంగా ప్రవర్తిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ బలహీనత అవకాశం ఇస్తున్న ప్రశ్న అది.

అసలు ఇదంతా ఎట్లా ప్రారంభమై ఎక్కడి దాకా వచ్చిందో, చిలికి చిలికి గాలివాన ఎలా అయిందో కూడా చూడాలి.

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ భాగస్వామ్య పక్షాలుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్ డి ఎ కూటమి అధికారంలో ఉందనీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నట్టు కనబడుతున్నప్పటికీ, అది కూడా ఎన్ డి ఎ కనుసన్నల్లోనే ఉన్నదనీ ఎంతో కాలంగా ఎందరో అంటూనే ఉన్నారు. అవినీతి కేసుల భయం వల్లనో, మరే కారణం వల్లనో జగన్ అమిత్ షా గీచిన గీత దాటకుండానే ఉన్నాడు. ఇప్పటికే ఎందరో ఎన్నోసార్లు చెప్పిన ఈ విషయాన్నే రాజకీయ విశ్లేషకుడు ప్రొ. కె నాగేశ్వర్ మే 19న 99 టీవీ మీద ఒక చర్చలో అన్నారు. అయితే ఆయన అదనంగా మరికొన్ని విషయాలు కూడా కలిపారు. నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ లు అమిత్ షాను కలిసినప్పుడు, జగన్ ను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని పవన్ కళ్యాణ్ కోరాడని, అప్పుడు అమిత్ షా, “మనకు జగనే శాశ్వత మిత్రుడు. చంద్రబాబు తాత్కాలిక మిత్రుడే. కనుక జగన్ మీద అటువంటి దురుసు వైఖరి తీసుకోకండి” అని సలహా ఇచ్చాడని, తర్వాత జరిగిన జనసేన కీలక నాయకుల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ మాట చెప్పి, అమిత్ షా ఏమన్నాడో చెప్పు అని నాదెండ్ల మనోహర్ తోనే చెప్పించాడని నాగేశ్వర్ అన్నారు. మర్నాడు మరొక వేదిక మీద కూడా ఇదే విషయాన్ని వివరించారు.

ఆ వ్యాఖ్యల మీద మే 21-22 నుంచి దుమారం రేగడం మొదలయింది. ప్రొ. నాగేశ్వర్ ఉటంకించిన సంభాషణ నిజమైనా, కాకపోయినా, అమిత్ షా కు జగన్ లొంగి ఉన్నాడనే మాట, శాశ్వత మిత్రుడనే మాట నిజమని అందరికీ తెలుసు. ఆ బహిరంగ రహస్యం ఆధారాలతో సహా బైటపడితే అందరి కంటే ఎక్కువ వైఎస్ఆర్ సిపి ప్రతిష్ఠ కోల్పోతుంది. కనుక కోపం వస్తే గిస్తే వారికి రావాలి. కాని నాగేశ్వర్ వ్యాఖ్యల మీద ఆ పార్టీ గాని, జగన్ గాని మాట్లాడలేదు. భాజపా, తెలుగు దేశం పార్టీలు కూడా స్పందించవలసినంతగా స్పందించలేదు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లు ఆ వ్యాఖ్యలను ఖండించి, ‘వీలైతే సోర్స్ బయట పెట్టు’ అని నాగేశ్వర్ ను నిలదీశారు. సోర్స్ ను కాపాడే ఉద్దేశంతో కావచ్చు, నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాని అన్నారు. అక్కడితో ఆ వ్యవహారం సమసిపోవలసిందే.

నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షమంటూ ఏమీ లేదని, ప్రతిపక్షం కూడ అమిత్ షా జేబులో తురుఫాసేనని అసలు విషయం చర్చలోకే రాలేదు. నాగేశ్వర్ ఆ బహిరంగ రహస్యాన్ని బయట పెట్టడం తప్పా ఒప్పా అని చర్చ, అంతకన్న ఎక్కువగా రచ్చ మొదలయ్యాయి. జనసేన పార్టీ కింది స్థాయి నాయకులు ఇంద్రపాలెం, కాకినాడ, బందరు, సర్పవరం వంటి అనేక పోలీస్ స్టేషన్లలో ప్రొ. నాగేశ్వర్ మీద, 99 టీవీ మీద కేసులు పెట్టారు. “తెలంగాణ వారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎందుకు” అని స్వయంగా పవన్ కళ్యాణ్ అన్న మాటను ఆయన పార్టీ నాయకులు అనేక మంది పునరుక్తం చేశారు. ఎవరి స్థాయిలో వారు, ఎవరి సంస్కారాన్ని బట్టి వారు బూతులు, తిట్లు, దుర్భాషలు జోడించారు. నాగేశ్వర్ ను వ్యక్తిగతంగా తూలనాడారు. సామాజిక మాధ్యమాలలో, యూట్యూబ్ ఛానళ్లలో నాగేశ్వర్ మీద, అవకాశం దొరికింది గదా అని తెలంగాణ మీద విద్వేషం వెళ్లగక్కడం ప్రారంభించారు. ఈ దాడిలో వెనుకబడిపోతున్నామని భావించిన తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా రంగంలోకి దిగి వారి సంస్కారాన్ని కూడా చూపుకున్నారు. ఒక తెలుగుదేశం రాష్ట్ర స్థాయి నాయకుడు, “తెలంగాణ అనే మాట ఎక్కడుంది? డిక్షనరీలో వెతికాను. ఆ మాటే లేదు” అని మొత్తం తెలంగాణ సమాజం పట్లనే అవమానకరమైన వ్యాఖ్య చేశాడు.

“తెలంగాణ ఎవరి జాగీరు కావడానికీ ఎప్పుడూ అంగీకరించలేదు. చరిత్ర పొడవునా అనేక జాగీర్దారీ వ్యవస్థలను వ్యతిరేకించింది, ప్రతిఘటించింది, కూలదోసింది. పవన్ కళ్యాణ్ అనే “లక్షలాది పుస్తకాలు చదివిన” నిరక్షర కుక్షికి, “అనపాలజెటిక్ సనాతనీ”కి ఇంత లోతైన విషయాలు తెలుస్తాయని అనుకోనక్కరలేదు. కనీసం జాగీరు అనే మాటను సొంత ఆస్తి అనే అర్థంలో వాడుతున్నాడనుకున్నా, అవును, తెలంగాణ భూమి పుత్రుల సొంత ఆస్తి. ఎవరి నెత్తురు ఆ భూమిలో చెమటగా మారి పంటలు పండించిందో, శ్రమ ఉత్పత్తులు సాధించిందో, ఎవరు ఆ నేల తల్లిని గౌరవించి అందులో మమేకమయ్యారో వారిది తెలంగాణ. మరెవరు ఆక్రమించినా, కబ్జా పెట్టినా, పెత్తనం చేసినా తన్ని తగలెయ్యాలనేదే తెలంగాణ ప్రజల కోరిక. రెసిడెన్సీ మీద తుర్రెబాజ్ ఖాన్ దాడి నుంచి 2014 జూన్ 2 దాకా ఆధునిక తెలంగాణ చరిత్ర అంతా ఆ తెలంగాణ భూమి పుత్రుల ఆకాంక్షల ప్రతిఫలమే.”

ఈ రచ్చ ఇంకా ముందుకు సాగి, అప్పటికే అనేక పోలీసు స్టేషన్లలో నమోదై ఉన్న ఎఫ్ఐఆర్ ల విషయంలో నాగేశ్వర్ ను అరెస్టు చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ కు బయలుదేరుతున్నారని మే 26న వార్తలు వచ్చాయి. నాగేశ్వర్ ఇంటిదగ్గరికి చేరిన తెలంగాణ పోలీసులు, తమ అనుమతి లేకుండా పొరుగు రాష్ట్రపు పోలీసులు ఈ రాష్ట్ర పౌరుడిని అరెస్టు చేసి తీసుకుపోకుండా కాపాడేందుకే, రక్షణ కల్పించేందుకే వచ్చామని అన్నారు. ఆ రోజంతా చూసినా ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాలేదు గాని, ‘అదుగో పులి అంటే ఇదిగో తోక’ అని అసలు పులి లేకుండానే వార్తలు పుట్టించగల, చిలవలూ పలవలూ అల్లగల వార్తా ఛానళ్లూ, యూట్యూబ్ ప్రసార మాధ్యమాలూ ఈ వార్తలనూ, వార్తలు కానివాటినీ, వక్రీకరణలనూ విస్తారంగా వ్యాపింపజేశాయి.

ఈ నేపథ్యంలో, ప్రొ. నాగేశ్వర్ మీద జరుగుతున్న దాడిని, అంతకన్నా ఎక్కువగా ఆ పేరుతో తెలంగాణ సమాజం మీద, సంస్కృతి మీద కొందరు ఆంధ్ర ప్రాంత వాసులు, కొన్ని ఛానళ్లు చేస్తున్న దాడిని చర్చించడానికి, నాగేశ్వర్ కు సంఘీభావం ప్రకటించడానికి తెలంగాణ క్రాంతి దళ్ మే 27న రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసింది. సహజంగానే ఉద్వేగాలు పెరిగిన వాతావరణంలో ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతి ఒక్కరూ నిగ్రహంగా మాట్లాడారని చెప్పలేం. కాని ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి పోటీగా, తెలంగాణ జనసేన మే 28న నిర్వహించిన పత్రికా సమావేశంలో, రౌండ్ టేబుల్ లో మాట్లాడినా సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరిని, ఇతర వక్తలను, జర్నలిస్టులను అడ్డగోలుగా దూషించారు. వారందరినీ వామపక్ష భావజాలం ఉన్నవారిగా ముద్రవేశారు. దానికి ప్రతిగా తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి, పవన్ కళ్యాణ్, తెలంగాణ జనసేన పాత, కొత్త ప్రవర్తనల మీద అభ్యంతరం తెలియజేశారు.

“ఇక్కడ గడిచిపోయిన దురాక్రమణ మాత్రమే కాదు, కొత్త, రానున్న దురాక్రమణల వ్యూహాలు, ముఖ్యంగా అమిత్ షా దుర్మార్గ వ్యూహాలు, పవన్ కళ్యాణ్ నోట్లోంచి బైటపడడం గమనించదగిన ప్రధాన విషయం. మాట మాటకూ పాకిస్తాన్ పేరు ఎత్తడం, పాకిస్తానీలకు, అర్బన్ నక్సల్స్ కు సభలకు అనుమతి ఇస్తారు గాని నాకు ఇవ్వరా అనడం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను, ముఖ్యంగా గద్దర్ వంటి తెలంగాణ అపారంగా గౌరవించే సాంస్కృతిక యోధుడి పట్ల అవమానకరంగా మాట్లాడడం… అన్నీ అవి పవన్ కళ్యాణ్ మాటలో జనసేన మాటలో కావనీ, తెలంగాణాను మింగడానికి అమిత్ షా, ఆర్ ఎస్ ఎస్ అనిపిస్తున్న మాటలని స్పష్టం చేస్తున్నాయి.”

వాతావరణం ఇలా వేడెక్కుతుండగా, పవన్ కళ్యాణ్ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినాన హైదరాబాద్ లో ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప’ సభ జరుపుతానని ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి పదకొండు రోజులు అన్నమూ నీళ్లూ ముట్టుకోలేదని ప్రకటించిన వ్యక్తి, కోనసీమలో కొబ్బరి చెట్లు మాడిపోతే అది తెలంగాణ దిష్టి అని ప్రకటించిన వ్యక్తి తెలంగాణ నవనిర్మాణం అనడాన్ని సహజంగానే తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ ఆగ్రహాన్ని చూసిన ప్రభుత్వం సభకు అనుమతి నిరాకరించింది. అనుమతి నిరాకరణతో బాధితుడిగా నటిస్తూ, పవన్ కళ్యాణ్ తన ఇంట్లోనే ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేశాడు.

అక్కడ ఆయన మాట్లాడిన అవాకులూ చెవాకులూ తెలంగాణ సమాజం మరొకసారి భగ్గుమనడానికి కారణమయ్యాయి. పన్నెండు సంవత్సరాలుగా కుటుంబాలకు కుటుంబాలే ఇక్కడే ఉంటూ, ఇక్కడి మార్కెట్ నుంచే తమ సినిమాలకు వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ, మమ్మల్ని రానివ్వరా, సభ పెట్టుకోనివ్వరా అని దొంగ ఏడుపులు ఏడుస్తూ, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి, “మీ అయ్య జాగీరా” అన్నాడు. ఒక ప్రాంత ప్రజలను ఉద్దేశించి, వారి ప్రాంతం గురించి, మరొక ప్రాంతం వారు ఇటువంటి వ్యాఖ్య చేయడం దుర్మార్గం.

అసలు జాగీరు అనే పదం వాడడమే సరైనది కాదు. రాచరికం రోజుల్లో ప్రజల మీదా, చిన్న రైతుల మీదా, కౌలుదార్ల మీద జులుం చేసి, వారి గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేసి, రాజుకు పంపించడానికి ఏర్పాటైన సామంత రాజ్యాలు జాగీర్లు. ఎవరో ఒక వ్యక్తి జాగీరు అని చెప్పడమంటే ఆ ప్రాంతం మీద ఆ వ్యక్తికి నిరంకుశాధికారం ఉందని అనడమే. ఇప్పుడు జాగీర్లూ లేవు, జాగీర్దార్లూ లేరు, జాగీర్ల గురించి మాట్లాడడమే అసందర్భం. తెలంగాణ ఎవరి జాగీరు కావడానికీ ఎప్పుడూ అంగీకరించలేదు. చరిత్ర పొడవునా అనేక జాగీర్దారీ వ్యవస్థలను వ్యతిరేకించింది, ప్రతిఘటించింది, కూలదోసింది. పవన్ కళ్యాణ్ అనే “లక్షలాది పుస్తకాలు చదివిన” నిరక్షర కుక్షికి, “అనపాలజెటిక్ సనాతనీ”కి ఇంత లోతైన విషయాలు తెలుస్తాయని అనుకోనక్కరలేదు. కనీసం జాగీరు అనే మాటను సొంత ఆస్తి అనే అర్థంలో వాడుతున్నాడనుకున్నా, అవును, తెలంగాణ భూమి పుత్రుల సొంత ఆస్తి. ఎవరి నెత్తురు ఆ భూమిలో చెమటగా మారి పంటలు పండించిందో, శ్రమ ఉత్పత్తులు సాధించిందో, ఎవరు ఆ నేల తల్లిని గౌరవించి అందులో మమేకమయ్యారో వారిది తెలంగాణ. మరెవరు ఆక్రమించినా, కబ్జా పెట్టినా, పెత్తనం చేసినా తన్ని తగలెయ్యాలనేదే తెలంగాణ ప్రజల కోరిక. రెసిడెన్సీ మీద తుర్రెబాజ్ ఖాన్ దాడి నుంచి 2014 జూన్ 2 దాకా ఆధునిక తెలంగాణ చరిత్ర అంతా ఆ తెలంగాణ భూమి పుత్రుల ఆకాంక్షల ప్రతిఫలమే. ఆ ప్రయత్నంలో పూర్తి విజయాలు సాధించి ఉండకపోవచ్చు. ఇంకా ఎందరో కబ్జాదారుల దురాక్రమణలు సాగుతుండవచ్చు. కాని, ఎదురు వచ్చి మీ అయ్యా జాగీరా అని అడగడానికి దురాక్రమణదారులకైతే కచ్చితంగా హక్కు లేదు.

ఇక్కడ గడిచిపోయిన దురాక్రమణ మాత్రమే కాదు, కొత్త, రానున్న దురాక్రమణల వ్యూహాలు, ముఖ్యంగా అమిత్ షా దుర్మార్గ వ్యూహాలు, పవన్ కళ్యాణ్ నోట్లోంచి బైటపడడం గమనించదగిన ప్రధాన విషయం. మాట మాటకూ పాకిస్తాన్ పేరు ఎత్తడం, పాకిస్తానీలకు, అర్బన్ నక్సల్స్ కు సభలకు అనుమతి ఇస్తారు గాని నాకు ఇవ్వరా అనడం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను, ముఖ్యంగా గద్దర్ వంటి తెలంగాణ అపారంగా గౌరవించే సాంస్కృతిక యోధుడి పట్ల అవమానకరంగా మాట్లాడడం… అన్నీ అవి పవన్ కళ్యాణ్ మాటలో జనసేన మాటలో కావనీ, తెలంగాణాను మింగడానికి అమిత్ షా, ఆర్ ఎస్ ఎస్ అనిపిస్తున్న మాటలని స్పష్టం చేస్తున్నాయి.

ఇంకా హాస్యాస్పద అంశం, పవన్ కళ్యాణ్ తెలంగాణకు ఎందుకొస్తాడు, ముఖ్యమంత్రి కావడానికా అని తన విషపుటాలోచనను కూడా బైటపెడుతూ, “ఆంధ్రప్రదేశ్ లోనే దిక్కులేదు, తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతాడా” అని తన గురించి తాను సరైన మాట అన్నాడు. దిక్కులేని నీ రాష్ట్రంలో దిక్కు తెచ్చుకొని చూడు, అదే పది వేలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *