తీవ్ర సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ!

మోదీ పదేళ్ల పాలనలో ఆర్థికాభివృద్ధి  డొల్ల
 ఏడుశాతం అభివృద్ధి పేరుతో గొప్పలు
 90శాతం మందికి దక్కని ఆర్థికప్రయోజనాలు
ప్రభుత్వ గణాంకాలకు అందనంతగా ధరల పెరుగుదల
 
భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై విదేశీ పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారు. విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను భారతీయ స్టాక్‌ మార్కెట్‌ నుంచి ఉపసంహరించు కుంటున్నారు. విదేశీ మదుపరులు ఈ నెలలో ఇప్పటివరకు రూ.85,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్కెమ్రాసికంలో, భారతీయ కంపెనీల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండడంతో విదేశీ పెట్టుబడిదారులు దూరమవుతున్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు చ్కెనా ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడం భారత మార్కెట్‌ను కూడా తాకింది.  భారతదేశం  ఆర్థికాభివృద్ధిలో  ఏడు శాతం వృద్ధితో ప్రపంచంలోనే అగ్రగామి గా ఉందని ప్రధాని మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నా ..90 శాతం మంది ప్రజలకు దీని ప్రయోజనాలు అందడం లేదన్నది కఠోర వాస్తవం!  ప్రజలు ఎదుర్కొంటున్న అసల్కెన ధరల పెరుగుదల ప్రభుత్వ గణాంకాలకు అందనంతగా ఉందన్నది మరో వాస్తవం.
భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొం టోందని వివిధ ప్రభుత్వ శాఖలు ఇటీవల విడుదల చేసిన వివిధ గణాంకాలు విదితం చేస్తున్నాయి. రూపాయి విలువ క్షీణించడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్టాక్‌ మార్కెట్‌ నుండి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, విపరీతమైన విదేశీ రుణాలు, విదేశీ వాణిజ్యలోటు వంటివి మన ఆర్థిక వ్యవస్థ దుస్థితిని వెల్లడిరచడమే కాదు.. క్షీణతను సూచిస్తున్నాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి అత్యధికంగా నష్టపోయింది. డాలర్‌ విలువ రూ.84.07 పైసలు. ఆ మారకపు విలువను కొనసాగించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ తన నిల్వల నుంచి పెద్ద మొత్తంలో డాలర్లను విడుదల చేస్తోంది. ఇది విదేశీ మారక నిల్వలను కూడా తగ్గిస్తుంది. మోదీ ప్రభుత్వం 2014 మేలో అధికారంలోకి వొచ్చినప్పుడు డాలర్‌ మారకం విలువ రూ.59.44 పైసలు కాగా పదేళ్లలో దాదాపు రూ.25 పడిపోయి రూ.84కి దిగజారింది. విదేశీ వాణిజ్య లోటు కూడా పెరుగుతోంది. ఆగస్టులో వాణిజ్య లోటు 2,970 డాలర్లకు పెరిగింది. గతేడాది ఆగస్టులో ఇది 2,421 కోట్లు. భారతదేశ ఎగుమతులు చాలా బలహీన స్థితిలో ఉన్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజల కొనుగోలు శక్తిని కూడా తగ్గిస్తుంది.  ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా 2008లో భారతీయ స్టాక్‌ మార్కెట్‌ నుండి విదేశీ పెట్టుబడులు ఉపసంహరించబడ్డాయి. అప్పట్లో అది పెద్ద ప్రభావం చూపింది. రూపాయి విలువ క్షీణతకు అది కూడా కారణమైంది. సెప్టెంబర్‌లో వస్తు, సేవల పన్ను వసూళ్లే ఇందుకు నిదర్శనం. 40 నెలల్లో అత్యల్ప వృద్ధి రేటు (-) 6.5 శాతం నమోద్కెంది.
image.png
ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటుతో పోలిస్తే సెప్టెంబర్‌లో జిఎస్‌టి ఆదాయం పెద్దగా పెరగలేదు. బొగ్గు, విద్యుత్‌, ముడి చమురు ప్రాసెసింగ్‌, మైనింగ్‌ వంటి ఎనిమిది కీలక రంగాల్లో ఉత్పత్తిపై ఆధారపడిన పారిశ్రామికోత్పత్తి సూచీ ఆగస్టులో ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే సెప్టెంబర్‌లో కార్ల విక్రయాలు 19 శాతం తగ్గాయి. సేవల రంగ సూచీ కూడా 10 నెలల కనిష్టానికి చేరింది. ఆర్థిక సంవత్సరం తొలి త్కెమ్రాసికంలో గృహ రుణాల పంపిణీ తొమ్మిది శాతం పడిపోయింది. బలమైన మరియు చలనశీలమైన ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ఇటువంటి అంశాలు క్షీణిస్తున్నాయి. పేలవమైన ఆర్థిక విధానాల ఫలితంగా మధ్యతరగతి, దిగువ తరగతులవారి ఆదాయం తగ్గింది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కొనుగోలు శక్తి లేకపోవడం. కొనుగోలు శక్తి కోవిడ్‌ పూర్వ స్థాయికి చేరుకోలేదని చాలా సూచికలు చూపిస్తున్నాయి. కొనుగోలు శక్తిని పెంచుకోవాలంటే దిగువన ఉన్న 50 శాతం మంది చేతిలో ఎక్కువ డబ్బు రావాలి. కానీ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రావిరీణ ఉపాధి హావిరీ చట్టం, ఇతర సంక్షేమ పథకాల కేటాయింపులు పెంచడం లేదు. దానికి బదులుగా, కార్పొరేట్‌ లకు పన్ను మినహాయింపులతో సహా భారీ సబ్సిడీలు ఇస్తోంది. మాంద్యం నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రత్యేక ప్యాకేజీలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావాలి. పెరుగుతున్న నిరుద్యోగం, వేతన పెరుగుదల లేకపోవడం ప్రజల కొనుగోలు శక్తిని క్షీణింపజేసింది. ఏడు శాతం వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ  స్తబ్దుగా ఉందనడానికి ఇంతకన్నానిదర్శనం అక్కర్లేదు.
-చరణ్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page