ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలు స్వాధీనం.మృతుల్లో ఒడిశా రాష్ట్ర మావోయిస్టు పార్టీ చీఫ్ చలపతి.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం.
భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 21 : ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లో 14 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీస్ అధికారులు ప్రకటించారు . వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో గరియాబంద్‌లోని కుల్హాదీఘాట్‌లోని భల్దిగి మరియు తర్జార్ అడవుల్లో మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు హతమైనట్లు భద్రతా బలగాలు ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్ ఛత్తీస్రా గడ్ రాష్ట్రంకు మరియు ఒడిశాలోని నుపాడా జిల్లాకు ఆనుకుని ఉన్నాయి.ఒడిశా పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, సి ఆర్ పి ఎఫ్ ‘కోబ్రా బెటాలియన్’ మరియు ఛత్తీస్‌గఢ్ పోలీసు సిబ్బంది ఆదివారం నాడు ఆపరేషన్ కోసం బయలుదేరారని, అక్కడ వారు అనుమానాస్పద మావోయిస్టులతో అర్థరాత్రి ఎన్‌కౌంటర్ చేశారని పోలీసు అధికారి తెలిపారు.ఈ ఎన్‌కౌంటర్ సోమవారం రాత్రి వరకు కొనసాగింది. సోమవారం మధ్యాహ్నం ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి.











మంగళవారం ఉదయం మరో 12 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి.భారీ మొత్తంలో అత్యాధునిక ఆయుధాలు దొరికాయి.. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.. హతమైన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మృతి చెందిన మావోయిస్టుల్లో కొందరు ఒడిశాలో పనిచేస్తున్న మావోయిస్టు సంస్థకు చెందిన సీనియర్ సభ్యులుగా గుర్తించారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు.ఈ ఎన్‌కౌంటర్‌లో కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఒక సైనికుడు గాయాలు పాలయ్యాడు.. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ. గత ఏడాది కాలంగా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మృతుల్లో ఒడిశా మావోయిస్టు పార్టీ చీప్ చలపతి, మనోజ్ ,గుడ్డు మృతి. : సోమవారం అర్ధరాత్రి జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టుల మృతి చెందారు. వీరిలో కొంతమంది అగ్ర నాయకులు ఉన్నారు. ఈ ఎన్కౌంటర్లో ఒడిశా రాష్ట్రం మావోయిస్టు పార్టీకి చెందిన ఒడిశా రాష్ట్ర చీప్ చలపతి మృతి చెందారు. ఇతను స్వస్థలం చిత్తూరు జిల్లా. అలాగే ఒడిసా ఇన్చార్జి మనోజ్, మరియు స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు గుడ్డు మృతి చెందినట్లుగా వార్తలు వొస్తున్నాయి.