సామాజిక న్యాయం కోసం కులగణన ఉద్యమం

జన గణనలోనూ కులాల లెక్కలు తీయాలి
ప్రస్తుత పోరాటం రాజ్యాంగ రక్షకులు.. రాజ్యాంగ శత్రువుల మధ్యనే..
తెలంగాణలో సామాజిక, ఆర్థిక, కుల సర్వే 92 శాతం పూర్తి
సంవిధాన్‌ ‌రక్షక్‌ అభియాన్‌ ‌సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి

దిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 26 :  ‌దేశవ్యాప్తంగా కుల గణన అనేది కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సాధించే సామాజిక న్యాయం మూడో ఉద్యమమని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్‌ ‌జవహర్‌ ‌నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయీకరణ వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం మొదటి దశ సాధిస్తే… రాజీవ్‌ ‌గాంధీ హయాంలో 18 ఏళ్లకే వోటు హక్కు.. మండల్‌ ‌కమిషన్‌ ‌నివేదిక వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం ఏ 2.0 పూర్తయిందని.. ఇప్పుడు సోనియా గాంధీ, మల్లికార్జున్‌ ‌ఖర్గే, రాహుల్‌ ‌గాంధీల ఆధ్వర్యంలో కుల గణనకు సామాజిక న్యాయం ఏ 3.0 ప్రారంభమైం దని రేవంత్‌ ‌రెడ్డి వివరించారు. సామాజిక న్యాయం కోసం రాహుల్‌ ‌గాంధీ మహాయుద్ధం ప్రకటించారని… ఆయన బాటలో నడుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సామాజిక, ఆర్థిక, కుల సర్వే మొదలుపెట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో సర్వే 92 శాతం పూర్తయిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

image.png
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో దిల్లీ తలకటొరా స్టేడియంలో మంగళవారం నిర్వహించిన సంవిధాన్‌ ‌రక్షక్‌ అభియాన్‌ ‌సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రసంగించారు. తెలంగాణలో కుల సర్వే పూర్తి కాగానే తాము సామాజిక న్యాయం మూడో మహా యుద్ధాన్ని ముందుకు తీసుకెళతామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. పదేళ్లుగా దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగ రక్షణకు రాహుల్‌ ‌గాంధీ దేశ వ్యాప్త ఉద్యమం చేపట్టారన్నారు. రాహుల్‌ ‌చేపట్టిన ఉద్యమంలో ప్రజలు భాగస్వాములైనందునే మోదీ 400 వందల సీట్లు అడిగితే ప్రజలు కేవలం 240 సీట్లకు పరిమితం చేశారని సీఎం అన్నారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ప్రజలు ఓడిస్తున్నారని..

వయనాడ్‌, ‌నాందేడ్‌ ‌లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శమని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిస్తే, ఝార?ండ్‌లో కాంగ్రెస్‌ ‌కూటమి గెలిచిందన్నారు. రాజ్యాంగ రక్షణ ఉద్యమం కేవలం రాహుల్‌ ‌గాంధీకి పరిమితమైన అంశంగా అనుకోవద్దని, మనమంతా అందులో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుత పోరాటం రాజ్యాంగ రక్షకులు… రాజ్యాంగ శత్రువుల మధ్యనే ఉందని గుర్తుంచుకోవాలన్నారు. మహాత్మా గాంధీ పరివార్‌ ‌రాజ్యంగ రక్షణకు పూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page