– 14 హోటళ్ల లైసెన్సులు సస్పెన్షన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : నగరంలో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో టీజీ సేఫ్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. గోల్కొండ, చార్మినార్ జోన్ల పరిధిలోని 22 రెస్టారెంట్లు, ఫుడ్ సంస్థల్లో ఏకకాలంలో 22 ప్రత్యేక బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించి ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలకు సంబంధించి కేసులు నమోదు చేసి వాటిలో 14హోటళ్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను సస్పెండ్ చేశారు. తక్షణమే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని వారికి ఆదేశాలు జారీ చేశారు.
వంట గదుల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకలు
తనిఖీల్లో ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం, కుళ్లిన కూరగాయలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. కొన్ని హోటళ్లలో వెజ్, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను కలిపి నిల్వ చేయడం, వంట గదుల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకల సంచారం ఉన్నట్లు గుర్తించారు. అంతేకాక ఆహారం తయారు చేసే సిబ్బంది తప్పనిసరిగా ధరించాల్సిన హెయిర్ నెట్స్, గ్లౌజులు, అప్రాన్లు లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా అధికారులు మొత్తం 21 ఆహార నమూనాలను సేకరించారు. వినియోగానికి పనికిరాని, కలుషితమైన, కుళ్లిపోయిన 544 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేశారు. అలాగే 13 కిలోల వాడిన వంట నూనెను పారబోశారు. తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తించిన మరో 8 హోటళ్లకు షోకాజ్ నోటీసులను టీజీ సేఫ్ అధికారులు జారీ చేశారు.
లైసెన్సులు సస్పెండ్ అయిన 14 రెస్టారెంట్లు ఇవే..
హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్- టోలిచౌకి, లక్కీ రెస్టారెంట్- సంతోష్ నగర్, షా ఘౌస్ కేఫ్- షాలిబండ, హోటల్ నయాబ్- చార్మినార్, శ్రీ బాలాజీ ఫ్యామిలీ దాబా- గుడిమల్కాపూర్, సిద్ధిఖీ కబాబ్ సెంట్రల్ కిచెన్- గుడిమల్కాపూర్, అల్ సబా హోటల్- టోలిచౌకి, మెహఫిల్ రెస్టారెంట్- దిల్‌సుఖ్‌నగర్ శ్రీ రాఘవేంద్ర ఉడిపి వెజ్- సంతోష్ నగర్, డైన్ హిల్ రెస్టారెంట్- మాసబ్ ట్యాంక్, సోహైల్ రెస్టారెంట్- మలక్‌పేట్, హోటల్ అక్షయ టిఫిన్స్- మలక్‌పేట్, హోటల్ వెంకటేశ్వర- హైదరాబాద్, అజీబో ది రాయల్ అరేబియన్ రెస్టారెంట్- రెతిబౌలి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





