హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి కొండపై జరుగుతున్న తెలంగాణ వేద విద్వన్మహాసభల ముగింపు వేడుకలకు గవర్నర్ దంపతులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గర్భాలయంలో స్వయంభువుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖమండపంలో పండితులు వేదమంత్రోచ్ఛారణలతో వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా దేవస్థానం ముద్రించిన 2027 నూతన వార్షిక క్యాలెండర్‌ను గవర్నర్ శుక్లా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో భవానీ శంకర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





