హైదరాబాద్, నవంబర్ 20 : ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య,ఉద్యోగ, రాజకీయ, కుల గణన రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతుంది బుధవారం వరకు 90,56,383, నివాసాలలో సర్వే పూర్తయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1,16,14,349 నివాసాలలో కాగానే, ఇందులొ నేటి వరకు 90.56,383 లక్షలలో నివాసాలను సర్వే పూర్తించేసి 78 శాతం లక్ష్యం పూర్తిచేశారు. నేటి వరకు రాష్ట్రంలో ములుగు జిల్లా అత్యధికంగా 97.552 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా లక్ష్యాన్ని మించి 98,080 నివాసాలను సర్వేచేసి 100.5 శాతం సాధించి మొదటి స్థానంలో నిలిచింది, జనగామ జిల్లా 99.9 శాతం, పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచింది.
నల్లగొండ 97.7 శాతంతో తృతీయ స్థానంలో ఉంది. అదేవిధంగా కామారెడ్డి 93.3 శాతం, మంచిర్యాల 93.2శాతం, యాదాద్రి భువనగిరి 92.3 శాతం, నిజామాబాద్ 91శాతం రాజన్న సిరిసిల్ల 90.9శాతం జగిత్యాల 90.6శాతం జరిగింది. రాష్ట్రంలో 9 జిల్లాలో కుడా 90 శాతం పైగా సర్వే పూర్తయింది. జిహెచ్‌ఎంసీ పరిధిలో కూడా సర్వే ప్రక్రియ ఊపందుకుంది. జిహెచ్‌ఎంసీ పరిధిలో 25,05,517 నివాసాలు సర్వే చేయల్సి ఉండగా బుధవారం వరకు 13,91,817 నివాసాలలో సర్వే పూర్తిచేసి 55.6 శాతం సాధించింది. ఈ సర్వే కు ప్రజల నుంచి మంచి స్పందన ఉందని అధికారులు వివరించారు. 52, 493 గ్రామీణ, 40 ,901 అర్బన్ బ్లాకులుగా మొత్తం 92 ,901 బ్లాకులుగా విభజించి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతోంది. సకాలంలో ఈ సర్వే పూర్తి చేసేవిధంగా జిల్లా ఇన్ చార్జ్ అధికారులు, కలెక్టర్ లు ఎప్పటిప్పుడు సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటున్నారు.