ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టాన్నిపకడ్బందీగా అమలు చేయండి

రీసెర్చ్ ‌యూనిట్‌ ‌ద్వారా అధ్యయనం చేయాలి
సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 20 : ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టాన్ని సీరియస్‌ ‌గా తీసుకొని పకడ్బందీగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. బుధవారం డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధులపై 32 శాఖల పనితీరుపై సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా కేటాయించిన నిధులు, చేసిన ఖర్చు, గత ఎడాది ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ , ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టం ప్రకారం అన్ని శాఖల్లో ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలని… అమలుకు సపోర్ట్ ‌యూనిట్‌ ఇప్పటికే ఉంటే ఇబ్బంది లేదు, లేని పక్షంలో సపోర్ట్ ‌యూనిట్‌ ఏర్పాటు చేసుకోవాలని ఈ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. అన్ని శాఖల్లో సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టం ప్రకారం నిధులు ఖర్చు అవుతున్నది లేనిది ఇక నుంచి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రెటరీ పర్యవేక్షిస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టం అమలుపై సెస్‌ ఇప్పటివరకు సమర్పించిన నివేదికలు అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా రీసెర్చ్ ‌సెంటర్‌ ఏర్పాటుచేసి ప్రత్యేక పథకాల రూపకల్పన చేయాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధుల ఖర్చుపై అన్ని శాఖలు 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. గిరిజన తండాలకు త్రీ ఫేస్‌ ‌విద్యుత్‌ ‌సరఫరా కావాలన్న డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో అధికారులు ఆ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో.. వొచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేసేందుకు అన్ని శాఖల అధికారులు మంచి పథకాలను సిద్ధం చేసుకుని ఆర్థిక శాఖకు నివేదిక సమర్పించాలన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యం, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ‌ప్లాన్‌ ‌చట్టం గత కాంగ్రెస్‌  ‌ప్రభుత్వ హయాంలోనే వొచ్చింది. ఈ పథకం అమలుపై ప్రజా ప్రభుత్వం స్పష్టంగా ఉంది. గత ప్రభుత్వ చర్యల మూలంగా పదేళ్లపాటు అర్హులైన వారు లబ్ధి పొందలేకపోయారు. మీ ద్వారా ఆ వర్గాలకు చేయూత ఇవ్వాలని కోరారు. సమావేశంలో స్పెషల్‌ ‌సిఎస్‌ ‌వికాస రాజ్‌, ‌ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ ఫైనాన్స్ ‌సందీప్‌ ‌కుమార్‌ ‌సుల్తానియా, ఎస్టీ వెల్ఫేర్‌ ‌సెక్రెటరీ శరత్‌, ‌ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ ఎస్సీ వెల్ఫేర్‌ ‌శ్రీధర్‌, ఇరిగేషన్‌ ‌సెక్రటరీ రాహుల్‌ ‌బొజ్జ, సిడిఎమ్‌ఏ ‌కమిషనర్‌ ‌శ్రీదేవి, ఆర్టీసీ ఎండి సజ్జనార్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్‌ ఇం‌టర్‌, ‌డిగ్రీ కళాశాలల సమస్యలు పరిష్కరిస్తాం..
కళాశాలల యజమానుల సమావేశంలో డిప్యూటీ సీఎం

ప్రైవేటు డిగ్రీ, ఇంటర్‌ ‌కళాశాలలకు సంబంధించిన వివిధ సమస్యలపైఈ ప్రభుత్వానికి అవగాహన ఉందని వాటనిపై  సానుకూలంగా స్పందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సచివాలయంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ‌బాలకృష్ణారెడ్డి, ప్రైవేట్‌ ‌కళాశాలల యజమానుల సంఘం సభ్యులతో డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. కళాశాలల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు.

విద్యావేత్త డాక్టర్‌ ‌చుక్కా రామయ్య కు జన్మదిన శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ప్రముఖ విద్యావేత్త, పూర్వ ఎమ్మెల్సీ డాక్టర్‌ ‌చుక్కా రామయ్యకు  ఆయన నివాసంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page