- సమావేశాన్ని బహిష్కరించిన బిఆర్ఎస్
- చైర్మన్ నియామకమే తప్పన్న బీఆర్ఎస్ నేత ప్రశాంత్‌రెడ్డి
తొలిసారి ఏర్పడ్డ పిఎసి భేటీని విపక్ష బిఆర్ఎస్ బహిష్కరించింది. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ అరెకపూడి గాంధీ అధ్యక్షతన దీన్ని ఏర్పాటు చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు, పీఏసీ సభ్యులు హాజరయ్యారు. పీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ సభ్యులు బహిష్కరించారు. ఛైర్మన్‌గా అరెకపూడి గాంధీని నియమించడంపై శ్రీధర్‌బాబును నిలదీశారు. పీఏసీ ఎంపిక తీరును నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించామని బీఆర్ఎస్ నేత ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఎంపిక అప్రజాస్వామికంగా జరిగిందన్నారు. ఇటీవల పీఏసీ ఛైర్మన్‌గా అరెకపూడి గాంధీని నియమించడాన్ని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.
ఈక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, గాంధీ సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. అరికెపూడి నియామకం తరవాత శనివారం తొలిసారిగా పీఏసీ సమావేశమైంది. అరికెపూడి గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులతోపాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన కాసేపటికే బీఆర్ఎస్ నేతలు మంత్రులతో వాగ్వాదానికి దిగారు. అర్హత లేని గాంధీకి పీఏసీ ఛైర్మన్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు నిరసనగా తాము సమావేశం నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఉదయం 11 గంటల తర్వాత సమావేశమైన ప్రజాపద్దుల కమిటీ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబుతోపాటు సభ్యులైన ప్రశాంత్ రెడ్డి, రావూరి ప్రకాశ్ రెడ్డి, వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, గంగుల కమలాకర్, రామ్రావు పవార్, అహ్మద్ బిన్న అబ్దుల్లా బలాల,కూనంనేని సాంబశివరావు సహా ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, భానుప్రసాద్‌రావు, జీవన్ రెడ్డి, ఎల్ రమణ హాజరయ్యారు. అసెంబ్లీ కమిటీలో హాల్లో జరిగిన సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి వివాదం మొదలైంది. అరికెపూడి గాంధీని పీఏసీ ఛైర్న్గా నియమించడంపై బీఆర్ఎస్ సభ్యులు నిలదీశారు. ఎంపిక తీరు సరిగా లేదని వాగ్వాదానికి దిగారు.
ఈ నియామకంలో కక్షపూరితంగా వ్యవహరించారని అందుకే ఈ భేటీని బహిష్కరిస్తున్నట్టు ప్రశాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎవర్నీ సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణం తీసుకున్నట్టు వెల్లడిరచారు.రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరును, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా కొన్ని కమిటీలు ఉంటాయి. వాటిలో ఒకటే ఈ ప్రజాపద్దుల కమిటీ. ఇందులో 9 మంది సభ్యులు ఉంటారు. ఇందులో ఛైర్మన్ పదవి మాత్రం ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన పార్టీకి లభిస్తుంది. సభ్యుల సంఖ్య కూడా ఆయా పార్టీల సంఖ్యాబలం బట్టి కేటాయిస్తారు. ఇక్కడే వివాదం నెలకొంది. అధికారంగా కాంగ్రెస్‌లో చేరిన వ్యక్తికి పీఏసీ ఛైర్మన్ ఇవ్వడంపై బీఆర్ఎస్ మండిపడిరది. ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర పదజాలంతో పార్టీ మారిన వ్యక్తులను టార్గెట్ చేశారు. దీంతో రెండు రోజుల పాటు మెదక్ అంతా అల్లాడిపోయింది.





