Tag revanth reddy

గురువులకు దూరమవుతున్న గుంపు మేస్త్రీ

“ఉద్యోగుల ఆర్థిక సమస్యలను కేవలం ఒక వర్గానికి సంబంధించిన డిమాండ్లుగా చూడటం సరికాదు. బకాయిపడిన ఆరు డీఏలు, పీఆర్సీ అమలు, పదవీ విరమణ ప్రయోజనాలు, ఇతర పెండింగ్‌ చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి దయాదాక్షిణ్యాలతో ఇచ్చే కానుకలు కావు; ఉద్యోగుల న్యాయమైన హక్కులు..” ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెండింగ్‌ బకాయిల కోసం ఎదురుచూస్తుండగా, ముఖ్యమంత్రి…

రాష్ట్రంలో యమ రంజుగా రాజకీయాలు

.”అంతేకాదు, మరో వ్యూహాం కూడా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకతను ఉప ఎన్నికల పేరుతో తగ్గించుకోవచ్చనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ సవాల్ స్వీకరించి కేసీఆర్ రాజీనామా చేస్తే, ఇటు మంత్రి సురేఖ పై హైకమాండ్ చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా సురేఖ రాజీనామా చేస్తుంది. . సురేఖ స్థానంలో అసలు…

కొండా సురేఖ బ‌ర్త‌ర‌ఫ్‌:  పార్టీపై ప‌ట్టు నిలుపుకున్న రేవంత్‌!!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన  పరిణామం చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి మంత్రివర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మహిళా నేత, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం, దానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆమోదముద్ర వేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫానుకు దారితీసింది. కొండా…

విజయపథంలో తెలంగాణ.. రేవంత్ పనితీరే సమాధానం..!

“టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు ఫామ్ హౌస్ పాలనే లక్ష్యం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకపోవడంతో రాష్ట్రం ఎంత వెనుకబడిపోయింది. దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉంటూ వివిధ జిల్లాలను పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి లాంటి యువనాయకత్వం,…

రేవంత్ ‘క్రిమినల్ వేస్ట్’ వ్యాఖ్య వెనుక రాజకీయ సందేశం..!

wp:quote –> “రాజకీయాల్లో పదాలకు అపారమైన శక్తి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకే పదం ప్రజల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగించిన “క్రిమినల్ వేస్ట్” అనే వ్యాఖ్య కూడా అలాంటి రాజకీయ చర్చకే కేంద్రబిందువైంది. ప్రత్యర్థులు ఈ వ్యాఖ్యను వ్యక్తిగత విమర్శగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, పాలనా దృక్పథంలో చూస్తే అది…

రేవంత్‌ ‘‌బ్లడ్‌’ ‌కామెంట్‌

Revanth’s ‘blood’ comment

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఇటీవలకాలంలో చేస్తున్న ప్రసంగాలు పలువురిని విస్మయపరుస్తున్నాయి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా వాడని భాషతో రాష్ట్ర రాజకీయాలను సంచలనాత్మకంగా మారుస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన నోటికి హద్దు లేకుండా పోతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకానొక సందర్భంగా తనకు హిట్లర్‌ ‌మార్గదర్శి అని చెప్పుకున్నారు. దానికి నిదర్శనంగా ‘రక్తం’ పారించడంపై ఆయన…

పొడుగు పొట్టి వివాదం

మనిషి పొడుగు, పొట్టి అన్న అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సహజంగా మనష్యుల ఎత్తు అన్నది వారి వయస్సు, జన్యుపరంగా, పోషకాహారం వల్ల ఉంటుందని చెబుతారు. అలాగే వారి తల్లిదండ్రులు లేదా వారి కుటుంబంలోని పెద్దల క్రమంగాకూడా మనిషి ఎదుగుదల ఉంటుంది. ఇలానే ఉండాలని ఎవరూ ఎత్తును నిర్దారించలేరు. అయితే శాస్త్ర…

గాసిప్‌ల‌కూ ఒక హ‌ద్దుండాలి!

 “నిప్పు లేనిదే పొగ రాదు” అనే సామెత ఉన్నప్పటికీ, ప్రస్తుత డిజిటల్ యుగంలో “పొగ సృష్టించి, నిప్పు అంటుకునేలా చేయడం” ఒక పెద్ద వ్యాపారంగా, రాజకీయ వ్యూహంగా మారింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో  బీఆర్‌ఎస్ సీనియర్ నేత టి. హరీశ్ రావు లేదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని  బిజెపి తమవైపు ఆకర్షిస్తోందని, వారికి ముఖ్యమంత్రి పదవి…

రేవంత్ రాజకీయ శైలి ప్రజాదరణకు ఆయుధమా? విమర్శలకు కారణమా?

“ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో, 24 గంటల వార్తా ఛానళ్ల ప్రభావం వల్ల, ఎన్నికల రాజకీయాల తక్షణ లాభాల కోసం భాషా సంయమనం పూర్తిగా మృగ్యమవుతోంది. క్లిక్ బైట్లు, రీల్స్, షార్ట్స్ కోసం నాయకులు మరింత ఘాటుగా మాట్లాడటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దురదృష్టవశాత్తూ తెలంగాణ రాజకీయాలు కూడా ఈ ప్రతికూల ధోరణికి మినహాయింపు కావడం లేదు.…