రేషన్‌ ‌కార్డు ఆధారంగా రైతుల గుర్తింపు

నేరుగా లబ్దిదారుల రుణ ఖాతాల్లో జమ
సమస్యలుంటే 30 రోజుల్లో పరిష్కారం
రైతు రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : పంటల రుణ మాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్‌ 12 ‌నుంచి 2023 డిసెంబర్‌ 13 ‌వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని, రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్‌ ‌కార్డు ప్రామాణికమని తెలిపింది. పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్‌ ‌పోర్టల్‌ ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్దిదారుల రుణ ఖాతాల్లోనే జమ కానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్ము విడుదల చేస్తారు. ఎస్‌హెచ్‌జీ, జేఎల్‌జీ, ఆర్‌ఎం‌జీ, ఎల్‌ఈసీఎస్‌ ‌రుణాలకు, రీషెడ్యూల్‌ ‌చేసిన రుణాలకు మాఫీ వర్తించదు. రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రైతు సమస్యలు ఉంటే 30 రోజుల్లో పరిష్కారించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వివర్లాలను వెబ్‌ ‌పోర్టల్‌పై కానీ, లేదా మండల సహాయ కేంద్రాలను సంప్రదించడం ద్వారా కానీ తెసుకోవచ్చని తెలిపింది. అన్ని వాణిజ్య బ్యాంకులు, గ్రావి•ణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల నుంచి రైతులు ఈ కాలంలో రుణాలు తీసుకుంటే వారికి కూడా రుణమాఫీ వర్తించనుంది. వ్యవసాయశాఖ కమిషనర్‌, ‌సంచాలకులు (డీఓఏ) పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేస్తారు. హైదరాబాద్‌లో గల నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్ ‌సెంటర్‌ (ఎస్‌ఐఐసీ) ఈ పథకానికి భాగస్వామిగా ఉంటుంది. వ్యవసాయశాఖ సంచాలకులు, ఎస్బీఐ కలిసి ఐటి పోర్టల్‌ ‌నిర్వహిస్తారు.

ఆ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్‌ అకౌంట్‌ ‌డేటా సేకరణ, డేటా వాలిడేషన్‌, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది. ఐటి పోర్టల్‌ ఆర్థిక శాఖ నిర్వహించే ఐఎఫ్‌ఎంఐఎస్‌ ‌పోర్టల్‌కి బిల్లులు సమర్పించడం, పథకానికి సంబంధించిన భాగస్వాములతో సమాచారం పంచుకోవడం, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకమైన మాడ్యూల్స్ ఉం‌టాయి. పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్‌ అధికారిగా (బీఎస్‌) ‌నియమిస్తారు. బ్యాంకు నోడల్‌ అధికారి బ్యాంకులకు వ్యవసాయశాఖ సంచాలకులు, ఎస్‌ఐసీ మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. బ్యాంక్‌ ‌నోడల్‌ అధికారులు తమ సంబంధిత బ్యాంక్‌ ‌యొక్క పంట రుణాల డేటాను డిజిటల్‌ ‌సంతకం చేయాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *