న్యూదిల్లీ జూలై24 : : సింగరేణిని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టం చేసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణపై పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి కిషణ్ రెడ్డి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
దేశంలో ఏ బొగ్గుగనినీ ప్రైవేటుపరం చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు.ప్రైవేటీకరణ చేయాలంటే 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర నిర్ణయమే కీలకని చెప్పారు. సింగరేణి ప్రైవేటీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లోనే ఉందని వెల్లడిరచారు. ఒడిశాతో చర్చించి సింగరేణికి ఒక గనిని కేటాయించామని తెలిపారు. సింగరేణికి కేంద్రం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.