నాకు యుద్ధం కావాలి
అణు ఇంధనం
అణువంత నేల పైన
మిగల కూడదు
అందుకే నాకు యుద్ధం కావాలి
పోయిన వాళ్లు మంచోళ్లు
ఉన్న వాళ్లు మంచోళ్లు అంటే
నేను అసలే ఒప్పు కోను
భూ భారం యుగాల తరబడి
పెరిగి పోతుంది
త్రాసు ముల్లు నిశ్చల స్థితి లో ఉండాలి
అందు కే నాకు యుద్ధం కావాలి
యుద్ధాల భయాల తో
ఎన్నాళ్ళు బతకాలి
రాజాధికారాలు ధ్వంస కావాలి
యుద్ధ ట్యాంకులు మందు గుండు
అంతా శూన్యం లో కలసి పోవాలి
నేల కాలుష్య రహితం కావాలి
యుద్ధాలు రాక తప్పవు
ఋతు చక్రం లో శాంతి రాక తప్పదు…
మారణాయుధాలు లేని నేల
పండువెన్నెల సోయగాల తో
వెలుగులు చిమ్మె సూర్య ప్రభలతో
కొత్త లోకం కొత్త కాంతి శాంతి
నేల కొత్త విత్తుకై ఎప్పుడు
ఎదురు చూస్తునే ఉంది
పుట్టుక వెంటనే చావు ఉంటుదనే
సత్యాన్ని మరిచి పోకు
శాంతి లోక స్థాపన కై
నాకు యుద్ధం కావాలి
-రేడియమ్
9291527757