12 మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి..?
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూలై 17 : మహారాష్ట్ర రాష్ట్రం గడ్చిరోలి జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. భద్రతా దళాలు ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఏకే 47 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం మావోయిస్టులు, సీ 60 కమాండోల మధ్య జరిగిన కాల్పుల్లో సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ పాటిల్ గాయపడగా ఆయనను హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలి జిల్లా హాస్పిటల్కు తరలించారు. ఉదయం నుంచి కాల్పులు కొనసాగగా సెర్చ్ అపరేషన్లో పోలీసులు పాల్గొన్నారు.