తెలంగాణ ఉద్యమకారులకు తగిన గుర్తింపు

– 4న అఖిలపక్ష భేటీ జరపాలని నిర్ణయం
– కేశవరావు కమిటీ తొలి భేటీ 

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ చైర్మన్ డాక్ట ర్ కె.కేశవరావు అధ్యక్షతన శనివారం సచివా లయంలో సమావేశం అయ్యింది. కమిటీ సభ్యులు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అద్దంకి ద యాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదం డరామ్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయ క్, మోతే శోభన్ రెడ్డిలు సంబంధిత ఉన్నతాధి కారులతో జరిపిన ఈ సమావేశంలో విధివి ధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు. ఉద్యమ కారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం కమిటీ వేస్తూ ఈ నెల 15న జీవో 679 జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ కమిటీ సచి వాలయంలో మొదటిసా రి సమావేశమైంది. జూన్ 4న అన్ని పార్టీల ప్రతి నిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి తగు సూచనలు, సలహాలు స్వీకరించాలని నిర్ణయించింది. అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమం తొలి, మలి దశలలో క్షేత్రస్థాయిలో ఉద్యమంలో పాల్గొన్న వారి వివరాలు సేకరించి పారదర్శకంగా అర్హుల జాబితా తయారీకి తగు కార్యాచరణ రూపొందించాలని అధికారులను కమిటీ ఆదేశించింది. ఉద్య మకారుల గుర్తింపు ప్రమాణాలు, జైలు శిక్షలు అనుభవించిన వారు, పలు పోలీసు కేసుల నమోదు, ఉద్యమంలో పాల్గొన్న మేధావులు, కళాకారులు, రచయితలు, ఉద్యోగులు, జర్నలిస్టులు, అడ్వకేట్లు, విద్యార్థులు, ఆర్టీసీ, సింగరేణి కార్మికులు అందరినీ గుర్తించి, సముచితంగా గౌరవించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపా రు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం, అలాగే వారి సేవలు, త్యాగాలకు తగిన గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. రాష్ట్ర సాధనలో విశేష కృషి చేసిన ఉద్యమ కారులకు ప్రభుత్వం తరపున తగిన గౌరవం, గుర్తింపు అందేలా సిఫారసులు చేయా లని కమిటీ నిర్ణయించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని, సమాచార సేకరణలో ఎటువంటి విమర్శలకు తావు లేకుండా ఉద్య మంలో పాల్గొన్న వారందరిని గుర్తించి సముచితంగా గౌరవించాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, జీఏడీ ప్రొటోకాల్ డైరెక్టర్ హరీష్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, న్యాయ శాఖ కార్యదర్శి పాపిరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *