ఆంధ్రాలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం!

దిల్లీలో టీడీపీ అరాచకాలను ఎలుగెత్తి చాటిన మాజీ సిఎం వైఎస్  జగన్‌
*  ఎక్కడా ప్రజాస్వామ్యం కనపడడం లేదు..అంతటా ఆటవిక రాజ్యమే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం  రక్తసిక్తమవుతోంది. వైకాపా కార్యకర్తలు, నేతలపై దాడులు, హత్యాకాండ, ఆస్తుల విధ్వంసానికి నిరసనగా జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలకు తెలియచేసేందుకు వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్‌ రెడ్డి ఈ నెల 24వ  తేదీన దిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సమాజ్ వాది పార్టీ, శివసేన ఉద్దవ్‌ థాక్రే, ఎండిఎంకె, టీఎంసీ తదితర పార్టీలు మద్ధతు ఇచ్చాయి.  ఆంధ్రాలో ఈ రోజు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి, ప్రతిపక్ష స్థానంలో ఉన్న వైకాపా మధ్య అగ్గిరాజుకుంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు పాశవికంగా వైకాపా కార్యకర్తలు  సానుభూతిపరులను టార్గెట్ చేనుకుని విధ్వంసం సృష్టిస్తున్నారు. ఎక్కడ చూసినా ఆటవికరాజ్యం దర్శనమిస్తోంది. చట్టపాలన లేదు. దారుణమైన హత్యలు, దాడులు జరుగుతున్నాయి. రాజకీయ హింస  పెచ్చరిల్లుతోంది.  కొన్ని చోట్ల వై.ఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ధ్వంసం  చేస్తున్నారు. పార్టీ కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారు.

ఎన్నికల రోజు ప్రారంభమైన హింస కౌంటింగ్‌ జరిగి, కొత్త త్వం ఏర్పాటై 50 రోజులు గడచినా ఇంకా హత్యాకాండ కొనసాగుతోంది.  దాదాపు 36 మంది వైకాపా కార్యకర్తలు ఊచప్రభుకోతకు గురయ్యారు. పోలీసులు మౌనంగా ప్రేక్షకపాత్ర వహిన్తున్నారు. దిల్లీలో ధర్నాచేసిన జగన్‌ ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా అపాయింట్‌ మెంట్‌ కోరారు. కాని లభించలేదు. కాని దిల్లీలో  టీడీపీ అరాచకాలను ఎండగట్టి జాతీయ దృష్టికి తీసుకెళ్లారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని టీడీపీ అమలు చేస్తోందని, భారత  రాజ్యాంగం అమలు కావడం లేదని జగన్‌ తీవ్రస్థాయిలోనే ఆరోపణలు చేశారు. ఎక్కడ చూసినా క్రిమినల్స్‌, రౌడీలు యథేచ్చగా రాజ్యమేలుతున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్‌ రెడ్‌ బుక్‌ను అందరికీ చూపించారు. ఈ పుస్తకంలో  సంఘ వ్యతిరేక శక్తులు, వైకాపాలో అరాచక శక్తుల పేర్లు, అవినీతి పరుల పేర్లను రాశానని, తమకు అధికారం వస్తే వీరి భరతం పడతానని లోకేష్‌ బహిరంగ సభల్లో చెప్పారు. ప్రస్తుతం రెడ్‌ బుక్‌తో లోకేష్ ప్లేక్సీలు అన్ని నగరాల్లో దర్శనమిస్తున్నాయి.  టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్‌ బుక్‌ రాజ్యాంగ అమలవుతోందని రాజకీయ విమర్శకులు ఆందోళన చెందుతున్నారు.  వైకాపా కార్యకర్తలు, నేతల, మహిళా కార్యకర్తల పట్ల టీడీపీ నేతల్లో విద్వేషం పెచ్చుమీరింది. ఈ ఉన్మాదం తారా స్తాయికి చేరుకుంది. ఎక్కడా ప్రజాస్వామ్యం కనపడడం లేదు. ప్రజలు ఎంతో ప్రేమతో భారీ మెజార్టీ ఇచ్చినా, ఎన్డీఏ కూటమిలోని పక్షాలు తమకు లభించిన అధికారాన్ని దుర్వినియోగం
చేసే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ దాడులకు టీడీపీ కార్యకర్తలు ఒక పథకం ప్రకారం దిగుతున్నారు. ఈ హింసకు  అంతు లేదా? ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మారణ కాండ జరుగుతోంది.

మునుపెన్నడూ ఈ తరహా దాడులు, హింసాకాండ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో  చోటు చేసుకోలేదు. రాజకీయ కక్ష్యల ముసుగులో వ్యక్తిగత వివాదాలు కూడా హింసకాండకు దారితీస్తున్నాయి. మానవ హక్కుల హననం జరుగుతోంది. ప్రజాస్వామ్య వాదులు మౌనంగా ఉన్నారు. పోలీనుల మౌనం ప్రజాస్వామ్యానికి తీవ్ర హాని జరుగుతోంది. వైకాపా కూడా అధికారంలో ఉన్నప్పుడు దాడులకు తెగబడింది. కాని ఇంత హింస  జరగలేదు. హింస  ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందే. అధికార, విపక్ష పార్టీల హింస వల్ల బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ హింస వల్ల ప్రజలు భయాందోళనలతో ఉన్నారు. తమ వర్గాలను కాపాడుకునేందుకు ప్రజలు వర్గాలవారీగా చీలిపోయి పోరాడుతున్నారు. దీని వల్ల బలహీనులు నష్టపోతున్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలను లేకుండా చేయాలనే ఆలోచన ప్రమాదం. ప్రస్తుతం ఆంధ్రాలో ఇదే జరుగుతోంది. వైకాపాకు స్థానం లేకుండా చేసేందుకు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు దిగడం వల్ల ప్రజాస్వామ్యం అపవాస్యమవుతోంది. వై.ఎస్ జగన్‌ను రాజకీయంగా ఏకాకిని చేయాలని, కార్యకర్తలను ఆయన నుంచి దూరం చేసేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలను ప్రజాస్వామ్యికవాదులు హర్షించడం లేదు. రాజకీయ ఉద్యమాలను అణచివేయాలని భవిష్యత్తులో వైకాపా క్యాడర్‌ చురుకుగా ఉండేందుకు వీలు లేకుండా టీడీపీ చేస్తున్న హింసాకాండ, మారణ హోమం వల్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలు దారుణంగా దెబ్బతింటాయి. కింది స్థాయి కార్యకర్తలపై దాడులకు పాల్పడడం హేయమైనది. ఈ తరహా దాడులకు వైకాపా లేదా టీడీపీ ఎవరు దాడులకు దిగినా ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే కచ్చితంగా రాజకీయ పార్టీలు నిర్భయంగా తమ కార్యకలాపాలు నిర్వహించుకునే వాతావరణం ఉండాలి. కింది స్థాయిలో పార్టీలోనైన బలహీనవర్గాలు, దళిత వర్గాల కార్యకర్తలు ఉంటారు. వారిని భయభాంతులకు గురి చేయడం అంటే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినట్లే.

దిల్లీలో వైకాపా నిర్వహించిన ధర్నా ద్వారా వై.ఎస్  జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో ఎన్డీఏ  కూటమి డొల్లతనాన్ని, రాజకీయ హత్యాకాండను బహిర్గతం చేశారు. ఈ ధర్నా ద్వారా రాజకీయంగా తాను ఒంటరివాడిని కానని, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటానని, ఎవరు కలిని వొచ్చినా రాకపోయినా, పార్టీని కాపాడుకుంటానని, తనను నమ్ముకున్న వారిని పరిరక్షించుకునేందుకు ఎంతైనా తెగించి పోరాడుతానని  వై.ఎస్  జగన్మోహన్‌ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బలమైన సంకేతాలు అందించారు. జగన్‌ తెగువ, సాహసాన్ని చూసి ఈ రోజు వైకాపా కార్యకర్తలు, నేతలు పార్టీ వెంటనే నడుస్తున్నారు. పోరాట పటిమ ఉన్న బలమైన నేత జగన్‌. రాజకీయాల్లో, ఎన్నికల్లో ప్రజల తీర్చు వల్ల బళ్లు, ఓడలు, ఓడలు బళ్లు అవుతుంబాయి. అంత మాత్రాన, రాజకీయంగా ఓటమి చెందిన రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, వారి ఇశళ్లపైన దాడులు, హత్యాకాండను కొనసాగించడం, అధికారంలో ఉన్న పార్టీలకు తగని పని.

జగన్‌ ఈ రోజు పెద్ద నిర్ణయం తీసుకుని దిల్లీలో ధర్నా చేయడం, తాను ఓటమి చెంది ఉండవొచ్చని, కాని ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడుతానని, దీని కోసం సర్వశక్తులు పణంగా పెట్టి పోరాడుతానని జగన్‌ దేశానికి చాటి చెప్పారు. ప్రజలు ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో పెద్ద మెజార్టీ ఇచ్చారు. అంత మెజార్టీ ఇస్తే జనరంజకమైన పాలన అందించేందుకు చంద్రబాబు , పవన్‌ కల్యాణ్‌ సమిష్టిగా అడుగువేయాలి. అంతేకాని రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పేరుతో విపక్ష పార్టీలపై దాడులకు తెగబడే విధంగా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడం అమానవనీయం. ఈ తరహా దుష్ట సంస్కృతికి   కాకలు తీరిన రాజకీయ నేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెక్‌ పెట్టాలి. ఇంత పెద్ద గెలుపును పాజిటివ్‌గా తీసుకుని ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ దృష్టిని కేంద్రీకరించాలి. అంతే కాని ప్రజా తీర్చును దుర్వినియోగం చేసే విధంగా దుందుడుకు దిగితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page