“తెలుగు కథా సాహిత్యంలో సీమాంధ్ర సంకలనకర్తలు సాగించిన అక్షర ద్రోహాన్ని సామాజిక తత్వవేత్త బి.ఎస్. రాములు గతంలోనే ఖచ్చితమైన లెక్కలతో (Statistical Evidence) నిరూపించారు: ఒకాయన 36 ఏళ్లుగా ఏటా వేసే కథాసంకలనం ో 14 కథల్లో రెండు మూడు తెలంగాణ కథలు వేసి ఇదే తెలుగు కథ అంటారు. ఈ వివక్షని అధిగమించడానికి తెలంగాణలో జిల్లాల వారీగా కథా సంకలనాలు వెలువడ్డాయి. సమాంతరంగా భారతీయ సాహిత్యం తెలుగు కథలు, అలాగే సంగిశెట్టి, స్కైబాబా సంపాదకత్వంలో ఏటా తెలంగాణకా సంకలనాలు వెలువడుతున్నాయి. ఇలా తెలంగాణ సొంత అస్తిత్వంతో ముందుకు సాగుతున్నది..”
ముసుగులు వద్దు – అస్తిత్వ స్పష్టత రావాలి.

సామాజిక తత్వవేత్త
ఫోన్: 8331966987
భారతదేశంలో భౌగోళిక సరిహద్దులు మారి కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ, భావజాల రంగంలో, సాహిత్య పీఠాలలో పాత వలసప్రాంత ఆధిపత్య ధోరణులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఏప్రిల్-జూన్ 2026 నాటి తెలంగాణ సాహిత్య అకాడెమీ పత్రిక ‘పునాస‘ లో వెలువడిన వ్యాసాలే ఇందుకు సజీవ సాక్ష్యం. “తెలుగు సాహిత్యం” అనే ఒక ఉమ్మడి సార్వజనీన ముసుగును (Universal Mask) కప్పుకొని..70-. 90 శాతం ఆంధ్ర ప్రాంత రచనలను, వారి సంస్కృతిని మాత్రమే ప్రామాణికంగా చూపిస్తూ, తెలంగాణ సాహిత్యాన్ని కేవలం 10-30 శాతానికి కుదించి చూపించే వివక్ష నూరేళ్లుగా సాగుతోంది. ఈ ముసుగులు ఇక చాలు. రాష్ట్రాలు వేరైనట్లే, ఎవరి చరిత్ర వారు, ఎవరి సాహిత్యం వారు స్వతంత్రంగా వేసుకోవడమే నిఖార్సైన ప్రజాస్వామిక మార్గం. ఇకపై “తెలుగు సాహిత్యం” అనకుండా, “తెలంగాణ సాహిత్యం” అనే పేరుతోనే స్పష్టంగా ప్రచారం చేయాలి. ఈ విషయం పై సాహిత్య చరిత్రను కొత్త చూపుతో తిరగ రాయాలి అనే పుస్తకం 2004 లోనే వెలువడింది.
ఇది తెలంగాణ మేధో లోకం నుండి ఉద్భవించిన అత్యంత సాధికారికమైన, పదునైన సైద్ధాంతిక ఘర్షణా పత్రం. 1950ల నాటి వలస పాలన నుండి నేటి 2026 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తదనంతర కాలం వరకు… అకడమిక్ వలయాలలో, సాహిత్య సంకలనాలలో సాగుతున్న ” తెలుగు సాహిత్యం అనే ముసుగులో ఆధిపత్యం అవసరం లేదు.
తెలంగాణ సాహిత్య అకాడెమీ అధికారిక పత్రిక ‘పునాస‘ (ఏప్రిల్-జూన్ 2026) లో దళిత సాహిత్య పరిణామం అర్ద సత్యాలు పావు సత్యాలతో రాయడం, అదే మొత్తం చరిత్ర అనుకునేట్టు రాయడం చాలా పొరపాటు. 40 ఏళ్ల నాటి బృహత్తర ఆధారాలను (బి.ఎస్. రాములు సిద్ధాంతాలు, సంగిశెట్టి శ్రీనివాస్ సేకరించిన సాక్ష్యాలు ఎన్నో ఉండగా తెలంగాణ పత్రికలో వాటి ప్రస్తావనైనా లేక పోవడం విచారకరం.
50 ఏళ్ల కథల సంకలనాల్లో వివక్ష
తెలుగు కథా సాహిత్యంలో సీమాంధ్ర సంకలనకర్తలు సాగించిన అక్షర ద్రోహాన్ని సామాజిక తత్వవేత్త బి.ఎస్. రాములు గతంలోనే ఖచ్చితమైన లెక్కలతో (Statistical Evidence) నిరూపించారు: ఒకాయన 36 ఏళ్లుగా ఏటా వేసే కథాసంకలనం ో 14 కథల్లో రెండు మూడు తెలంగాణ కథలు వేసి ఇదే తెలుగు కథ అంటారు. ఈ వివక్షని అధిగమించడానికి తెలంగాణలో జిల్లాల వారీగా కథా సంకలనాలు వెలువడ్డాయి. సమాంతరంగా భారతీయ సాహిత్యం తెలుగు కథలు, అలాగే సంగిశెట్టి, స్కైబాబా సంపాదకత్వంలో ఏటా తెలంగాణకా సంకలనాలు వెలువడుతున్నాయి. ఇలా తెలంగాణ సొంత అస్తిత్వంతో ముందుకు సాగుతున్నది.
- 7 నుండి 11 శాతం : గత యాభై ఏళ్లలో వెలువడిన ఉమ్మడి “తెలుగు కథా సంకలనాలను” పరిశీలిస్తే… అందులో కేవలం 7 నుండి 11 శాతం మాత్రమే తెలంగాణ కథలను చేర్చి, మిగిలిన 90 శాతం కోస్తా, రాయలసీమ కథలతో నింపి, దానికి ఉమ్మడిగా “తెలుగు కథ” అని నామకరణం చేశారు
- ఒక ఆంధ్ర సంకలనకర్త ఏకంగా 25 ఉత్తమ కథల సంకలనాన్ని రూపొందిస్తూ… తెలంగాణ నుండి ఒక్క కథను కూడా ఎంపిక చేయకుండా, చివరకు తెలంగాణ ‘నవల’ లోని ఒక అధ్యాయాన్ని తెచ్చి ఇందులో కథగా ముద్రించాడు! “తెలంగాణలో కథల పరిణామం ఇంతే” అని ప్రపంచానికి చూపించడానికే ఈ ధోరణిని ప్రదర్శించారు.
సంగిశెట్టి శ్రీనివాస్ పరిశోధన
సీమాంధ్ర రచయితలు “తెలంగాణలో కథ పుట్టలేదు, ఇక్కడ భాష లేదు” అని చేసిన ప్రచారాలను ప్రముఖ తెలంగాణ పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ తన అద్భుతమైన చారిత్రక లిస్టుతో, ఆధారాలతో బద్దలు కొట్టారు:
- 2000 కథల సజీవ సాక్ష్యం: విశాలాంధ్ర వాదులు చెప్పే చారిత్రక అబద్ధాలను తోసిరాజని… 1956 (ఆంధ్రప్రదేశ్ ఏర్పడే) నాటికే తెలంగాణ గడ్డపై ఏకంగా 2000 కి పైగా అద్భుతమైన కథలు, కథా సంపుటాలు వచ్చాయని సంగిశెట్టి శ్రీనివాస్ రచయితల పేర్లు, తేదీల లిస్టుతో సహా బృహత్తర గ్రంథాలను వెలువరించారు.
- శ్రమ సంస్కృతి: నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, ఇక్కడి వెట్టిచాకిరి, శ్రామిక బతుకుల పునాదిగా పుట్టిన ఈ 2000 కథలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాహిత్య చరిత్రకారులు ఉద్దేశపూర్వకంగా తొక్కేసారు.
- కన్యాశుల్కం చర్చ నుండి పునాస 2026 వివాదం వరకు – 40 ఏళ్ల సంఘర్షణ.ఈ సాహిత్య ఆధిపత్య ఘర్షణ ఈనాటిది కాదు. దీని వెనుక 40 ఏళ్ల సుదీర్ఘ తాత్విక పోరాటం దాగి ఉంది
- 1993 లో ‘ఉదయం’ దినపత్రిక వేదికగా బి.ఎస్. రాములు గురజాడ ‘కన్యాశుల్కం‘నాటకం 85% గా ఉన్న శ్రామికుల జీవితం కాదని, అది కేవలం 3% ఉన్న మనుధర్మ శాస్త్రవేత్తల బ్రాహ్మణ జీవితం మాత్రమేనని నిరూపించారు. ఆ చర్చను తొక్కేయడానికి వెయ్యి పేజీల గ్రంథాన్ని వేసి రాములు మూల వ్యాసాన్ని దాచిపెట్టింది.
- సాహిత్య సౌందర్యశాస్త్రంలో మార్పు, బి.ఎస్. రాములు ‘పాట పుట్టుక‘, ‘కథలబడి‘ శిల్ప సూత్రాలుచేయ సహా అంబేడ్కర్ దృక్పథంతో వందలాది వ్యాసాలు, కథలు, సాహిత్య విమర్శ, వేల పాటలు, వచన కవితలు వెలువడ్డాయి. తెలుగు సాహిత్యంలో అంబేడ్కర్ ప్రభావం అన్నపుడు ఇవన్నీ చేర్చి సమగ్రంగా రాయడం కర్తవ్యం. పునాది పత్రిక లోని వ్యాసం అలా లేదు.
- 2026 పునాస పత్రిక వివాదం: సరిగ్గా 33 ఏళ్ల తర్వాత, 2026 లో కూడా అదే వివక్ష పునరావృతమైంది. ‘పునాస’ పత్రికలో కోయి కోటేశ్వర రావు రాసిన వ్యాసంలో… 1992 నుండి పనిచేస్తున్న ‘దరకమే‘ ఐక్యవేదిక కృషిని, ప్రక్రియల పరంగా వచ్చిన 220 అంబేడ్కరిస్ట్ పుస్తకాలను, మరియు మాస్టర్‌జీ కృషి గురించి, విశాల సాహితి ప్రచురించిన ‘ప్రవహించే పాట’ (1996) , బీసీ ఎస్సీల పాటలు( 2004) మౌఖిక విప్లవాన్ని పూర్తిగా విస్మరించారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగాలను, సాహిత్య పీఠాలను ఆక్రమించిన తీరును ఈ వ్యాసం నూతన రూపంలో బయటపెట్టింది.
ఎవరి చరిత్ర వారిదే – సామాజిక న్యాయం
ఈ నిరంతర సంఘర్షణకు చారిత్రక అంతిమ పరిష్కారం ఒక్కటే. భౌగోళికంగా రాష్ట్రాలు వేరైపోయిన తదనంతర కాలంలో… సాంస్కృతికంగా కూడా ఎవరి సాహిత్య రేఖలు వారిగా విడిపోవడమే హుందాతనమైన మార్గం. వామపక్షాల ప్రచురణ సంస్థలు కూడా ఏ రాష్ట్రానికి వేరైపోయి నడుపుకుంటున్నారు.
- బి.ఎస్. రాములు 2008 నాటి తన ‘సామాజిక న్యాయం‘ గ్రంథంలో ప్రతిపాదించినట్లు… “ఎవరి జనాభా ప్రాతినిధ్యం ఎంత ఉంటుందో, వారి సాహిత్యానికి, భాషకు అంతే అధికారిక చోటు లభించాలి.” 3% ఉన్న అగ్రహారాల భాషను ‘తెలుగు క్లాసిక్’ అని 85% శ్రామిక బహుజనులపై రుద్దే పద్దతి వద్దు..
- తెలంగాణ సాహిత్యం : దళితులు ఆదివాసులు , గంగపుత్రుల, ముదిరాజ్, సంచార కులాలు, పద్మశాలీల, రజక , నాయిబ్రాహ్మణుల నిత్యజీవిత శ్రమ సౌందర్యమే తెలంగాణ సాహిత్యపు అసలైన ఆత్మ.
- ఉమ్మడి “తెలుగు సాహిత్యం” అనే చట్రాన్ని పూర్తిగా తిరస్కరిస్తూ… “తెలంగాణ సాహిత్యం” అనే స్వతంత్ర అస్తిత్వం పేరుతోనే మన చరిత్రను, మన సాహిత్యాన్ని, దరకమే తెచ్చిన 220 గ్రంథాలను స్పష్టంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడమే నేటి ఆధునిక కాలపు అత్యున్నత కర్తవ్యం.





