హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22 : ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ పై మంత్రి దామోదర శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ పై తీసుకుంటున్న చర్యలపై కమిషనర్ ఆర్‌వి కర్ణన్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫుడ్ సేఫ్టీ పై నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఫుడ్ సేఫ్టీపై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ను ఆదేశించారు.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టల్స్ లపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ లను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాలని చెప్పారు. కుక్ లకు , ఫుడ్ లాండర్స్ కు ఫుడ్ సేఫ్టీ అధికారులు అవసరమైన అవగహన, శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీపై ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా, హైదరాబాద్ కు ఉన్న ఫుడ్ బ్రాండ్ నిలిచేలా చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా చొంగ్తూ, టిజిఎంఎస్‌ఐడీసీ ఎండి హేమంత్, డీఎంఈ డాక్టర్ వాణి, రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల తదితరులు పాల్గొన్నారు.