కార్యకర్తలు సమర్థవంతంగా పనిచేయాలి
బూత్ కమిటీలు పటిష్టంగా ఉండాలి: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22 : వొచ్చే జిహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కాషాయ జెండానే ఎగురుతుందని స్థానిక ఎంపీ, బిజెపి నేత ఈటల రాజేందర్ ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం మల్కాజిగిరిలోనీ పద్మావతి ఫంక్షన్ హాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, సభ్యత్వ నమోదు – వర్క్ షాప్ కార్యక్రమానికి తల్లోజు ఆచారి ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డితో కలిసి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వర్క్ షాపులు మొక్కుబడిగా చేయవద్దని అన్నారు. ప్రజా ప్రతినిధి కావాలనుకునేవారే సమావేశాలకు రాకపోతే ఎలా? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుడికి పని గంటలు ఉండవని, 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యకర్తల భాగస్వామ్యం లేకపోతే పార్టీ ముందుకు సాగదని, స్థానిక బలం లేకపోతే పార్టీ గెలవదని చెప్పారు.
నాయకులు, కార్యకర్తల మధ్య పని విభజన చేయాలని,పార్లమెంట్ ఎన్నికలు దేశరక్షణ, అభివృద్ధి మీద ఆధారపడి జరుగుతాయని, కానీ స్థానిక సంస్థల ఎన్నికలు గెలవాలంటే బూతు కమిటీలు పటిష్టంగా ఉండాలని చెప్పారు. పార్టీ మీద కమిట్మెంట్, ప్రజలతో సంబంధం, పనిచేసే గుణం, సమర్థత ఉన్నవారికే బూత్ కమిటీ బాధ్యతలు అప్పగించాలని సూచించారు. మండల, డివిజన్ అధ్యక్షులు పూర్తి సమయం కేటాయించే వారికే ఇవ్వాలన్నారు. పాత నాయకులకు, సీనియర్లకు సముచిత స్థానం ఇవ్వాలని, తప్పకుండా ప్రతీ కార్యక్రమంలో భాగస్వామ్యంకలిపించాలన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ లో 3.65 లక్షల సభ్యత్వం నమోదైందని, కానీ చాలా ప్రాంతాల్లో సభ్య త్వం అనుకున్న స్థాయిలో జరగలేదని అసం తృప్తి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బిఆరెస్, ఎంఐఎంతో పొత్తు ఉండదని, మనం సొంతంగా ఎదగాలన్నారు. ప్రాం తీయ పార్టీల్లో నాయకుడు ఖతమైతే పార్టీ ఖతమవుతుంది. కానే జాతీయ పార్టీలలో పార్టీ ఫస్ట్ అనే విధానం ఉంటుంది. పార్టీ బలంగా ఉంటే డబ్బులు, లిక్కర్ పనిచే యదు అని అన్నారు. ఎంపీగా గెలిచిన రోజు నుంచి తాను మీ వెంటనే ఉంటు న్నానని తెలిపారు. స్కాములు లేని పాలన కావాలంటేబీజేపీతోనేసాధ్యమని, ఒక్కసారి అధికారం ఇవ్వాలని ప్రజలు భావిస్తు న్నారని, దానిని మనం అందిపుచ్చు కోవాలని పిలుపునిచ్చారు. . కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, మీసాల చంద్రయ్య, భాను ప్రకాష్, సూర్య రావు, వీకే మహేష్, వాసంశెట్టి శ్రీనివాస్, నరహరి తేజ పాల్గొన్నారు.