కోదండరాం… ఎమ్మెల్సీ పదవీ రాగానే గొంతు మూగపోయిందా..?

హరీష్‌రావు సూటి ప్రశ్న

విద్యార్థులకు,  నిరుద్యోగుల గొంతుక అవుతానన్న టిజేఏసి ఛైర్మన్‌, ఎమ్మెల్సీ కోదండరాం ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవీ రాగానే గొంతు మూగపోయిందా? అని హరీష్‌రావు వ్యంగ్యంగా అన్నారు. టిజేఏసి ఛైర్మన్‌ కోదండరాం ఎందుకు మౌనంగా అంటున్నారనీ, నిరుద్యోగుల ఎజెండానే నా ఎజెండా అని కోదండరాం అన్నారనీ గుర్తు చేస్తూ…ఎమ్మెల్సీ పదవీ రాగానే గొంతు మూగపోయిందా?అని  సూటిగా  ప్రశ్నించారు. పోలీస్‌ బలగాలు, లాఠీ చార్జీలు, ఇనుప కంచెలతో విద్యార్థుల్ని అణచి వేద్దామనుకుంటే మరింతగా నిరుద్యోగుల నిరసనలు, ఆందోళనలు  ఉధృతం అవుతాయనీ హెచ్చరించారు.  ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌, బిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు వేలేటి రాధాకృష్ణశర్మ, కడవేర్గు రాజనర్సు, కాముని శ్రీనివాస్‌, పాల సాయిరాంతో కలిసి ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కోదండరాం, రియాజ్‌, చింతపండు నవీన్‌, ఆకునూరి మురళీ ఎక్కడున్నారనీ అడిగారు. . కోదండరాం, రియాజ్‌, చింతపండు నవీన్‌, ఆకునూరి మురళీ అందరూ అశోక్‌నగర్‌ వెళ్లండి విద్యార్థులతో చర్చించాలన్నారు. నిరుద్యోగులకు మోసం చేసి, ఉద్యోగాలు పొంది ఒక్క మాట్లాడటం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *