మళ్లీ ఎప్పుడు
పుడతావు నేస్తం
హక్కుల సాయిబాబా
ఒకసారి వస్తే అక్కున
చేర్చుకుంటామంటూ!
ఆదివాసి గూడాలు
నీకోసం ముంగిట్లో నిలబడి
ఎదురుచూస్తు ఉన్నాయి!
నీవు లేనందుకు అడవి
ఎన్ కౌంటర్ కట్టు కథల
మధ్యన రోదిస్తుంది!
దండకారణ్యం ను
రాజ్యం రాక్షసంగా
కౌగిలించుకుంటున్నది!
తూటాల దెబ్బలకు
పచ్చని చెట్లు
రక్త కన్నీరు కారుస్తూన్నాయి!
నీ త్యాగం
నువ్వు చెప్పిన పోరు పాఠం
వృదాపోదు!
దశదిశలా చాటుతాం!
ముందు తరాలకు
నీ జైలు కథని వినిపిస్తాం!
నీ జీవితాన్నే బోధిస్తాం!
నీటిలో చేప
కల్పిత కథ కాదు!
నీలాంటి వాళ్ళను చూసి పుట్టుకోచ్చిందే!
ఆదివాసి గుడాల్లో అడుగులై
మా గుండెల్లో పదే పదే
గుర్తుచేసుకుంటాం!
నీవు కేవలం
విద్యను బోధించే
ప్రొఫెసర్ మాత్రమే కాదు
నూతన మానవుడి అన్వేషణలో
కోట్ల మంది ప్రజల గొంతువి..!
శోభరమేష్
కాకతీయ విశ్వవిద్యాలయం
8978656327
(ప్రొఫెసర్ సాయి బాబా సార్ అకాల మరణానికి స్పందిస్తూ )