Take a fresh look at your lifestyle.

రోశయ్య మృతి పట్ల మంత్రులు హరీష్‌ ‌రావు, కెటిఆర్‌, ‌సబిత, ఎంఎల్‌సి కవిత సంతాపం

రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయనకు మిత్రులు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ప్రత్యేక శైలిని చాటుకున్న రోశయ్య మృతిచెందడం బాధాకరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆంకాంక్షించారు.దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర శాసన సభలో 15 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఆయన చేయని పదవిలేదు, గౌరవం లేదన్నారు. ఆయన పనిచేసిన అందరు సీఎంలో మన్ననలు పొందారని చెప్పారు. రోశయ్యతో తనకు ఎంతో అనుబంధం ఉందని, తనను ఎంతో ప్రోత్సహించేవారని గుర్తుచేసుకున్నారు. ఆయతో కలిసి మంత్రిగా పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రకటన వొచ్చిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోశయ్య మృతి పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ‌నివాళి అర్పించారు.

కొణిజేటి రోశయ్య మరణం బాధాకరమని తన ట్వీట్‌లో కేటీఆర్‌ ‌తెలిపారు. ఓ సందర్భంలో రోశయ్యతో దిగిన ఫోటోలను మంత్రి కేటీఆర్‌ ‌తన ట్వీట్‌లో పోస్టు చేశారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ ‌తన ట్వీట్‌లో చెప్పారు. రాజనీతిజ్ఞుడు, అపర చాణిక్యుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకి తీరని లోటని మంత్రి పేర్కొన్నారు. రోశయ్య మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన రోజులను సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేసుకున్నారు. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని సబిత తెలిపారు. రోశయ్య మృతి పట్ల .. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారం వ్యక్తం చేశారు. ఇవాళ ఆమె తన ట్విట్టర్‌లో రోశయ్య మృతి పట్ల స్పందించారు. రోశయ్య కుటుంబ సభ్యులకు, వారి అభిమానులకు ఆమె ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఎన్నో కీలక పదవులను అలంకరించిన రోశయ్య ఎంతో మందికి ప్రేరణగా నిలిచారని, ఆయన మరణం వారందరిలో తీవ్ర విషాదాన్ని నింపినట్లు ఎమ్మెల్సీ
కవిత తన ట్వీట్‌లో తెలిపారు.

Leave a Reply