– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల
– భద్రకాళి అమ్మవారి రథాన్ని ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే నాయిని
– పద్మాక్షి, భద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు
హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: వరంగల్, హనుమకొండ నగరాలకు ఐటీ టవర్ల ఏర్పాటు కోసం కృషి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన వరంగల్ నగరంలో పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల అభి వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పేర్కొ న్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని మంత్రి శ్రీధరాబాబు అభినందించారు. శనివారం నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హనుమకొండలో నిర్వహిం చిన ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ (ఎడిషన్-2)ను ప్రారంభించిన అనంతరం మంత్రి దుద్దిళ్ల, ఎ మ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి నగ రంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించా రు. తొలుత పద్మాక్షి అమ్మవారిని దర్శించుకుని హోమం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సతీమణి నాయిని నీలిమా రాజేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు. వరంగల్ నగరానికి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటిచెప్పే భద్రకాళి అమ్మవారి రథ నిర్మాణ పనులు పూర్తి కావడంతో, ఆలయ అధికారులు, అర్చకుల ఆ ధ్వర్యంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మె ల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాన్ని ముందుకు లాగి ప్రారంభించారు. మాడవీధుల్లో ఊరేగింపునకు అమ్మవారి రథం ప్రారంభం కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ శైవక్షేత్రమైన వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామివారిని దర్శిం చుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద పూజల్లో పాల్గొన్నారు. వరంగల్ నగరం చారిత్రక కట్టడాలు, ప్రాచీన ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయమని మంత్రి తెలిపారు. ఈ ప్రాంత వారసత్వ సంపదను కాపాడుతూ ఆలయాల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు వరంగల్, హ సుమకొండ నగరాల్లో నగరా ఐటీ టవర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




