– 72 అడుగుల భారీ బతుకమ్మ ఏర్పాటు
– సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
– సంబరాలకు విచ్చేసిన గవర్నర్ శుక్లా
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకలు హైదరాబాద్లోని అంబర్పేట్ గ్రౌండ్లో అత్యంత వైభవంగా శనివారం జరిగాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన 72 అడుగుల భారీ బతుకమ్మను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సందర్శించారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచస్థాయిలో చాటిచెప్పేలా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.
గవర్నర్ శుక్లాకు ఘన స్వాగతం
బతుకమ్మ సంబరాల ప్రాంగణానికి విచ్చేసిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. సంప్రదాయ డప్పు వాయిద్యాల మోత, తెలంగాణ కళాకారుల విన్యాసాలు, మహిళల కోలాటాలు, మంగళహారతులు, బతుకమ్మల ప్రదర్శన నడుమ కార్యక్రమం కోలాహలంగా సాగింది. దారిపొడవునా మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలకడంతో అంబర్పేట్ మైదాన పరిసర ప్రాంతమంతా పండుగ శోభతో పులకించిపోయింది. వేలాదిమంది మహిళలు పాల్గొని ఆటపాటలతో సంబరాలను జరుపుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




