– గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: పోలీసు స్మారక వారోత్సవాల సందర్భంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన 157మంది పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో కమాండోలు, సీనియర్ అధికారులు, ప్రొబేషనరీ డీఎస్పీలు పాల్గొన్నారు. ప్రజాసేవతోపాటు ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడటంలోనూ ముందుంటామని పోలీసులు ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పారు. గ్రేహౌండ్స్‌లో మూడు వారాలపాటు ‘జంగిల్ ఆపరేషన్స్ అండ్ సర్వైవల్ టాక్టిక్స’లో శిక్షణ పొందుతున్న 30మంది ప్రొబేషనరీ డీఎస్పీలు సైతం రక్తదానం చేశారు. తెలంగాణ గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల డీజీపీ (ఆపరేషన్స్) డాక్టర్ అనిల్‌కుమార్ కార్యక్రమంలో పాల్గొని రక్తదాతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్లు ఎండీ అష్ఫాక్, ఎ. వెంకటేశ్వర్లు, పి.వి.నారాయణస్వామి, స్క్వాడ్రన్ కమాండర్లు బి.శంకరయ్య, జి.రాజు, ఆక్టోపస్ అదనపు ఎస్పీ సీహెచ్.రఘునందన్‌రావు, గ్రేహౌండ్స్ వైద్యాధికారులు డాక్టర్ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ పి.మంజురెడ్డి, ఆక్టోపస్ వైద్యాధికారి డాక్టర్ పి.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ సహకారంతో శిబిరాన్ని నిర్వహించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




