– రూ.228 కోట్లకు పైగా అక్రమాస్తుల గుర్తింపు
– రూ.5 లక్షల లంచం తీసుకుంటూ గత నెల చిక్కిన అధికారి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెట్గా చిక్కిన కీసర సీఐ అరకపల్లి ఆంజనేయులుపై ఏసీబీ మరో కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించి అతడిపై మరో కేసు నమోదు చేశారు. శనివారం ఆంజనేయులుకు చెందిన ఇంటి పై, అతడికి సంబంధించిన నలుగురు కుటుంబ సభ్యుల ఇళ్లపై దాడులు చేసి విలువైన డాక్యుమెం ట్లను స్వాధీనం చేసుకున్నారు. పలు ఇళ్లతో పాటు మిర్యాలగూడ హాలియాలో నాలుగు ఎకరాల వ్యవ సాయ భూమి ఉన్నట్లు సోదాలో గుర్తించారు. నగ దు. బంగారం, వాహనాలు, ఇంటి పరికాలతో అధి కార లెక్కల ప్రకారం మొత్తం 2.28 కోట్లు ఆస్తులు, అనధికారికంగా రెట్టింపు విలువ ఉంటుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. గత నెల 17న స్టేషన్లో రూ.5 లక్షల లంచం తీసుకుంటూ సీఐ ఆంజనేయులు ఏసీబీకి పట్టుబడ్డాడు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




