మేర కులుస్తులు పాల్గొనాలని రాష్ట్ర మేర ఐకాస పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెనుకబడిన కులాల సర్వేలో మేర కులస్తులు పాల్గొనాలని..తెలంగాణ మేర కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ మునిగాల రాము పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన కోసం పోరాటం చేసి.. కుట్టు మిషన్లు రోడ్డున వేసుకున్న ఘనత మేర కులస్తులదని తెలిపారు. పస్తులుండి ఉద్యమంలో పాల్గొన్నామని.. చివరికి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా మా బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా చిరకాల ఆకాంక్ష మేర కార్పొరేషన్ ఇచ్చి ఊరట కలిగించిందన్నారు. ఇప్పుడు వెనుకబడిన కులాల సర్వే నిర్వహించి బడుగు బలహీన వర్గాలకు సామాజిక వెనుకబడిన కులాలకు వర్గాలకు ఆదుకోవాలనే చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాజిక సర్వే చేపట్టిందన్నారు. ఆర్థిక, విద్య, ఉపాధి వెనుకబడిన కులాల సర్వే నిర్వహించేందుకు ముందుకు వొచ్చిందని.. దీనిని తప్పుదోవ పట్టించే వారి మాటలు నమ్మొద్దని తెలంగాణ మేర కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ మునిగాల రాము సూచించారు. అందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజిస్టర్డ్ సంఘాలు నాయకులు మేర కులస్తులను చైతన్యం చేయాలని ఎన్యూమరేటర్లకు కులస్తుల వివరాలు తెలిపి సహకరించాలని ఆయన కోరారు. మేర కులస్తుల జనాభా ఎంత తేలుతుందో అంత వాటా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జేఏసీ వ్యవస్థాపకులు మునిగాల రమేష్, అడ్వైజర్ బోనగిరి చంద్రశేఖర్, కో కన్వీనర్ మేడిగ సంతోష్, మునిగాల మల్లికార్జున్, ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రెసిడెంట్ మాడిచెట్టి వెంకటేశం, ప్రధాన కార్యదర్శి గట్ల పద్మనాభం, కోశాధికారి తాళ్ల నరసింహులు, కొట్టురు రమేష్, శీలం నగేష్, దీకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.