*ప్రాంరంభించనున్న పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
*జనవరి 13 నుంచి 15 వరకు ఉత్సవాల నిర్వహణ
రంగు రంగుల గాలిపటాలతో.. కన్నుల పండుగకు హైదరాబాద్ వేదికైంది. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్ ను సోమవారం సాయంత్రం 4 గంటలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. జనవరి 13 నుంచి 15 వరకు జరగనున్న ఈ కైట్ ఫెస్టివల్ లో అంతర్జాతీయ, వివిధ రాష్ట్రాల కైట్ ప్లేయర్లు పాల్గొనబోతున్నారు. పతంగుల పండగతో పాటు స్వీట్ ఫెస్టివల్ ను కూడా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంప్రదాయ వంటలు, పంజాబ్, గుజరాత్, కేరళ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఇంట్లోనే తయారు చేసిన రకరకాల స్వీట్లను పుడ్ కోర్టుల్లో ప్రదర్శించి, విక్రయించనున్నారు. మూడు రోజులపాటు జరిగే వేడుకలకు దాదాపు 15 లక్షల మందికి పైగా సందర్శకులు వొస్తారని అంచనా వేస్తున్నారు.