హైదరాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11:గణేష్ ఉత్స వాల సందర్భంగా నిమజ్జనం జరిగే ప్రదేశాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇబ్బం దులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిహె చ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట జోనల్ కమి షనర్లను ఆదేశించారు. బుధవారం అడిషనల్, జోన ల్ కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో కమి షనర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లా డుతూ… గణేష్ నిమజ్జనం ఉన్న నేపథ్యంలో శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో రోడ్డుపై పడిన చెత్త, ఇతర వ్యర్థాలు వెను వెంటనే తొలగిం చేందుకు శానిటేషన్ సిబ్బం దిని ఏర్పాటు చేసు కోవాలని, అవసరమైతే అదన ంగా శానిటేషన్ కార్మికులను ఏర్పాటు చేసి రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డార్క్ స్పాట్స్ లేకుండా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిమజ్జనం పురస్కరించుకొని శోభా యాత్ర సందర్భంగా ఎలా ంటి ఇబ్బందులు తలెత్త కుండా రోడ్లపై పాట్ హో ల్స్ పూడ్చాలని ఆదేశి ంచారు. అంతే కాకుండా ట్రీ ప్రూనింగ్కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని, అధికా రులను ఆదేశించారు. మండపం నుండి నిమజ్జనం శోభాయాత్ర మార్గంలో చెట్లు, విద్యుత్ వ్రేలాడే వైర్లు, డార్క్ ప్లేస్, పాట్ హోల్స్ గుర్తించి వెను వెంటనే తగు చర్యలు చేపట్టాలని, స్థానిక అధికారులతో కమిటీ వేసుకొని చర్యలు తీసుకునే విధంగా చూడా లన్నారు. తీసుకున్న చర్యలపై నివేదిక అంద జేయాలని ఆదేశించారు. విద్యుత్, యు.బి.డి, ఏ ఈ లు, పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎలాంటి సమస్యలు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లకు ఆదేశించారు.
– సిపిఆర్ఓ జిహెచ్ఎంసి ద్వారా జారీ చేయడమైనది.





