హైడ్రాపై ఆందోళన వొద్దు
ఎస్‌హెచ్ గ్రూప్‌లకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలి
బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతులు ఇవ్వదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. బుధవారం ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిహెచ్‌ఎంసి, టౌన్ ప్లానింగ్ వంటి ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలు పరిశీలించి నిర్మాణాలకు అనుమతులిస్తాయని, ఏ ప్రభుత్వమైనా వీటిని కొనసాగిస్తాయని వివరించారు. హైడ్రా సెక్యూరిటీ, ట్రాఫిక్ నియంత్రణ, కబ్జాదారులు పార్కులు, సరస్సులు ఆక్రమించుకోకుండా చూస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వంలోని కొన్ని శాఖ లకు బ్యాంకింగ్ రంగం ద్వారా చేయూత అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా సమా వేశం ఏర్పాటు చేసుకోవడం అభినందనీ యమన్నారు.
భవిష్యత్‌లోనూ ఈ సాంప్రదా యాన్ని కొనసాగిద్దామని తెలిపారు. ఈ సమావేశం ఏర్పాటుకు చొరవ చూపిన బ్యాంకర్లు, స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు ను డిప్యూటీ సీఎం అభినందించారు. ఆది ప్రజా ప్రభుత్వమని, ప్రజల పట్ల కమిట్ మెంట్ తో ఉన్నామని డిప్యూటీ సీఎం అన్నారు. మహి ళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం కేవలం మహిళలు ఊరికే తిరగడానికి అని కొంతమంది అనుకుంటారు.. అది వాస్తవం కాదని తెలిపారు. మహాలక్ష్మి పథకం మహిళలు గౌరవ మర్యాదలతో జీవించేందుకు దోహద పడుతుందన్నారు. మహిళలు బయటకు వొచ్చి ప్రపంచాన్ని చూడాలని, అవకాశాలు తెలుసుకోవాలని, వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కుటుంబాలకు ఆర్థికంగా చేయూతను ఇవ్వాలనేదే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వెనుక ఉన్న ఉద్దేశం అని వివరించారు. ఈ పథకం ద్వారా మహిళలు అధికంగా బలోపేతమవుతారు, తద్వారా కుటుంబం బలోపేతమవుతుందని వివరి ంచారు.
స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్ నిర్ణయించిందని, వీలైతే అంతకు మించి వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. కార్పొరేట్ కమర్షియల్ బ్యాంకులు తొమ్మిది నుంచి.. 13 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో పనిచేయాలి.. రుణాలు ఇచ్చే ముందు ఉన్న నిబంధనలు సరళతరం చేయాలని కోరారు. ప్రైవేటు విభాగాల్లో బ్యాంకర్లు ఇచ్చిన రుణాల రికవరీ శాతం తక్కువగా ఉంటుంది, అదే స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇచ్చిన రుణాల రికవరీ శాతం చూస్తే 98 శాతానికి పైగా ఉందని.. బ్యాంకర్లు స్వయం సహాయక సంఘాల మహిళలకు తక్కువ వడ్డీతో ఎక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వాల న్నారు. మహిళల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి వారికి లీజుకు ఇవ్వాలని ఆలోచన సైతం చేస్తున్నట్టు తెలిపారు. స్వయం సహాయక సంఘాల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, మధ్యతర పరిశ్రమలు, పార్కులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.. ఈ కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. బ్యాంకర్లు విశాల దృక్పథం గొప్ప హృదయంతో సహకరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఏర్పడు తుంది అన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు 12 వేల కోట్ల పైగా టర్నోవర్ చేస్తున్నారు..
ఇదే సమయంలో గిరిజన ప్రాం తాల్లోని సంఘాలు సుమారు 200 కోట్ల వరకు తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. వారు తీసుకున్న రుణాలు మాఫీ చేయడం లేదంటే వన్ టైం సెటిల్మెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించాలని తెలిపారు. హైదరాబాదులో 3000 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వాలని నిర్ణయించాం. వాటిని ఐదు వేల కోట్లకు తీసుకువెళ్లాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యవసాయం తర్వాత పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించేది సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలే.. పెద్ద సంఖ్యలో ఇండస్ట్రియల్ పార్కులు తీసుకువొస్తున్నాం, బ్యాంకర్లు సహకరించాలని కోరారు. తెలంగాణను గొప్ప రాష్ట్రంగా, ప్రోగ్రెసివ్ స్టేట్‌గా ముందుకు తీసుకుళ్లాల నుకుంటున్నాం.బ్యాంకర్లు విస్తరిం చాలని కోరారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్, మున్సిపల్ అడ్మిని స్ట్రేషన్ డైరెక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.





