కావూరి హిల్స్‌లో ఆక్రమణ కూల్చివేత

కోర్టు ఆదేశాలు ఉన్నాయన్న కమిషనర్‌ ‌రంగనాథ్‌

‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌23:  ‌హైదరాబాద్ మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. కావూరి హిల్స్‌లోని పార్కు ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగించారు. పార్కులో ఏర్పాటు చేసిన స్పోర్టస్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్‌ ‌ఫిర్యాదు చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం నిర్మాణాలను తొలగించారు.

అనంతరం అక్కడ కావూరి హిల్స్ ‌పార్కు అని బోర్డు ఏర్పాటు చేశారు. మరోవైపు దీనిపై స్పోర్ట్స్  అకాడమీ నిర్వాహకులు స్పందించారు. కావూరి హిల్స్ అసోసియేషన్‌ ‌తమకు 25 ఏళ్లకు లీజుకు ఇచ్చిందన్నారు. ఆ గడువు ముగియక ముందే నిర్మాణాలను అన్యాయంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌మాట్లాడుతూ కోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page