మాసాబ్ ట్యాంక్‌లో దారుణం

– న్యాయవాదిని కారుతో ఢీకొట్టి చంపిన దుండుగులు
– కారు నంబర్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో న్యాయవాది ఖాజా మొహియుద్దీన్‌పై ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన తన కారు వద్దకు వచ్చి వెనక సీట్లో బ్యాగు పెట్టి డ్రైవింగ్ సీట్‌లో కూర్చోబోతున్నారు. అప్పటికే పక్కా ప్లాన్‌తో అక్కడ వేచి ఉన్న దుండగులు ఒక్కసారిగా కారుతో అతివేగంగా దూసుకొచ్చి ఆయనను బలంగా ఢీకొట్టి పరారయ్యారు. కారు ఢీకొట్టిన వెంటనే న్యాయవాది గాల్లోకి ఎగిరి కిందపడ్డారు. దీంతో ఆయనకు తీవ్రమైన గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆయన మృతిచెందారు. న్యాయవాదిపై హత్యాయత్నం దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సమాచారం తెలుసుకున్న తోటి న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాజా మొహియుద్దీన్‌ను కారుతో ఢీకొట్టిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇది న్యాయవ్యవస్థపైనే దాడి అని వారు అభివర్ణించారు. ఈ ఘటనపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. న్యాయవాదిపై దాడికి గల కారణాలు, ఆయనపై ఎవరు దాడి చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *