రాములుపై దాడిచేసిన నిందితులను అరెస్ట్ చేయాలి

•ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలలి
•రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తల డిమాండ్
•పథకం ప్రకారం దాడులు జరిపిన మతోన్మాద శక్తులు
 రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములుపై అయ్యప్ప మాల ధరించిన మతోన్మాద శక్తులు శక్తులు చేసిన దాడికి వ్యతిరేకంగా సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డికొమురయ్య హాల్ లో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రొ.లక్ష్మీనారాయణ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా హాజరైన వక్తలు ప్రొ.హరగోపాల్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కిష్టప్ప, విష్ణు న్యాయవాది, ప్రొ. నాగేశ్వరరావు, ప్రాధానోపాధ్యాయులు రాములు, అనిల్ కుమార్, సోమయ్య, శ్రీపాల్ రెడ్డి, వెంకన్న, నన్నెబోయిన తిరుపతి, లింగారెడ్డి, యాదగిరి, వెంకట్, శంకర్, అశోక్ కుమార్, మహేష్, రామకృష్ణ, విజయ్, ప్రదీప్, రఘునందన్, మామిడి నారాయణ, లక్ష్మణ్ సింగ్, రాజయ్య, కిషన్ రావు, దామోదర్ తదితరులు మాట్లాడుతూ విద్యార్థి తల్లిదండ్రులతో ఏమాత్రం సంబంధం లేకుండా సుమారు 50 మంది అయ్యప్ప స్వాములు రాములుపై భౌతిక దాడి జరపడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. కొట్టిన తర్వాత జైశ్రీరామ్ అని నినాదాలు ఇస్తూ హెచ్చరికలు చేస్తూ పాఠశాల నుండి వెళ్లిపోయి తిరిగి రాములు మీదనే విశ్వహిందూ పరిషత్ కేసులు పెడుతున్నారంటే మతోన్మాద శక్తులు ఎంత పథకం ప్రకారం దాడులు జరిపి తప్పించుకొని విక్టిమ్స్ ని నిందితులుగా చేస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. తుక్కుగుడా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములుపై దాడి చేసిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి శిక్షించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కళాశాలలో విశ్వవిద్యాలయాల్లో జనవరి 20వ తేదీన సమావేశాలు జరిపి మతోన్మాద శక్తుల జోక్యాన్ని వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ బ్లాకు బాడ్జెస్ ధరించాలన్నారు. మండల జిల్లా, రాష్ట్ర స్థాయిలలో మతోన్మాద శక్తుల జోక్యం ఆపడానికి ఆఫీసర్లు టీచర్స్ పౌర సమాజ వ్యక్తులతో ప్రభుత్వమే కమిటీలు వేయాలన్నారు. మతాలకు సంబంధించిన విగ్రహాలు, గుర్తులు,డ్రెస్సలు విద్యాసంస్థలలో నిషేధించాలి .. మత సంబంధమైన ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేయకూడదని పేర్కొన్నారు. విద్యా సంస్థలలో టీచర్స్ మధ్య గాని, విద్యార్థుల మధ్య గాని కుల వివక్ష, కుల దురహంకారం, మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఈ విషయాల మీద ముఖ్యమంత్రిని, డిజిపి, షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ ను కలిసి మెమొరాండములను ఇవ్వాలన్నారు. నిందితులపై నాన్ బెయిలబుల్  కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోకపోతే, మత సామరస్య కమిటీలు వేయకపోతే చలో తుక్కుగూడ, జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు, రాష్ట్రవ్యాప్త ధర్నా జరపాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఉపాద్యాయ సంఘం, యూటీఎఫ్, టీపీటీఎఫ్, పీఆర్టీయూ, డీటీఎఫ్, డీబీఎఫ్, బీటీఎఫ్, హెడమాస్టర్స్  అసోసియేషన్, గురుకుల జేఏసీ, పీడీఎస్యూ, పీవైఎల్, బాలల హక్కుల సంఘం తదితర సంఘాలు నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page