- ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేయాలి
- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో అక్షరాలను ఆయుధంగా అందించి ప్రజల పోరాటానికి బాసటగా ప్రజాతంత్ర దినపత్రిక నిలిచిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం తన చాంబర్‌లో ప్రజాతంత్ర 27వ వార్షికోత్సవం సందర్భంగా నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. తెలంగాణ తొలి దినపత్రిక ప్రజాతంత్ర తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఆవశ్యకతను చాటిచెప్పి ప్రజలను చైతన్యపరిచిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పురుడు పోసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత అవసరమో దేశానికి చాటిచెప్పిందన్నారు.
డిజిటల్ మీడియా యుగంలోనూ జర్నలిజం విలువలకు కట్టుబడి పత్రికారంగంలో 27 ఏళ్ళుగా కొనసాగడం గొప్పవిషయమని అన్నారు. రెండున్నర శతాబ్దాలకుపైగా ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వొచ్చే క్రమంలో అక్షర ప్రస్థానాన్ని మంత్రి అభినందించారు. సంపాదకుడి భావనలకు ప్రాధాన్యత ఇచ్చేలా కాకుండా ప్రజా ప్రయోజనాలకు కాపాడేలా పత్రికలు పనిచేయాలని సూచించారు. పరిశోధనాత్మక కథనాలతో మొరుగైన సమాజానికి పాటుపడాలన్నారు.
విలువలతో కూడిన జర్నలిజం సమాజానికి మేలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి రామసహాయం రఘురామ రెడ్డి, ఎమ్మెల్యేలు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాస్ రావు, కాంగ్రెస్ నాయకులు తుళ్ళూరి భ్రమ్మయ్య, ఆళ్ళ మురళీ, నాగేంద్ర త్రివేది, టిపిసిసి నాగా సీతారాములు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తిక్, ఐన్‌టియూసి ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్, ప్రజాతంత్ర స్టాఫ్ రిపోర్టర్ అరుణ్‌కుమార్, భద్రాచలం స్టాఫ్ రిపోర్టర్ పిల్లి రాజు, ప్రజాతంత్ర రిపోర్టర్లు వాకచర్ల శ్రీనివాసరావు, కంపాటి రాజేందప్రసాద్, ఎస్‌కె గోరె, ఇల్లంగి ఆశీర్వాదం, విష్ణు తదితరులు పాల్గొన్నారు