మిర్యాలగూడ, ప్రజాతంత్ర, అక్టోబర్ 04: మీ పిల్లలకు మేము పెట్టిన టాలెంట్ టెస్ట్‌లో మంచి ర్యాంకు వచ్చింది…. ఉన్న ఫీజులో మేము రాయితీ ఇస్తాము…. మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది… వెంటనే మీరు మా కళాశాలలో చేరాలంటే అడ్వాన్స్‌గా కొంత డబ్బు కట్టండి… లేదంటే మీకు వచ్చిన ర్యాంకు వేరే వారికి కేటాయిస్తాం… తర్వాత ఇప్పుడు ఇచ్చిన రాయితీ ఇవ్వరు… అప్పుడు ఇంకా ఫీజు ఎక్కువగా అవుతుంది…. కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోండి… మా కళాశా లలో మీ పిల్లలు చేరితే ఐఐటీలో సీటు సాధించేలా చేస్తాం… ఎమ్‌సెట్-మెడిసిన్‌లో బెస్ట్ ర్యాంర్‌గా వచ్చేలా తర్ఫీదు ఇస్తాం… అంటూ కార్పోరేట్ కళాశాలలు మధ్య తరగతి వర్గాలకు వల వేస్తున్నాయి. ముందస్తు ఫీజుల రూపంలో భారీగా దండుకునేందుకు అడ్వాన్స్ టాలెంట్ టెస్ట్ పేరులతో ముందస్తుగానే సొమ్మును కాజేస్తూ తల్లిదండ్రుల బలహీన తలను ఆసరాగా చేసుకుని కొన్ని కార్పోరేట్ కళాశాలలు విద్యార్ధుల మానసిక స్ధితిపై ప్రయోగాలు చేస్తూ పబ్బం గడుపుతున్నాయి. కార్పోరేట్ కళాశాలలు చేస్తున్న మాయాజా లంలోకి తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ తమ పిల్లలపై భయంకరమైన ఒత్తిడిని కలిగిస్తున్నారు.
గ్రామీణ విద్యార్ధులపై ప్రభావం చూపనున్న టాలెంట్‌టెస్ట్‌లు:
అర్ధవార్షిక పరీక్షలు కాకముందే కొన్ని కార్పో రేట్ కళాశాలలు పట్టణ ప్రాంతాలలోకి వచ్చి ముందస్తు టాలెంట్ టెస్ట్‌లు పెడుతున్నారు. ఈ టాలెంట్ టెస్ట్‌లలో ఇంటర్ సిలబస్‌ను జోడించడంతో గ్రామీణ విద్యార్ధులు, సాధారణ స్ధాయి పాఠశాల విద్యా ర్ధులు ఆ పేపర్‌ను చేయ లేక బెంబేలె త్తుతున్నారు. ర్యాంకు రాకపోతే తన చదువు బాగా లేదని, స్కూల్ ఉపాధ్యాయులు సరిగా చెప్పడం లేదని విద్యా ర్ధులు మనోవేదనకు గురికావడంతో పాటు తల్లిదండ్రులు సైతం విద్యార్ధులపై చిన్న చూపు చూస్తున్నారు. కనీసం 10వ తరగతిలో సగం సిలబస్ కూడా పూర్తి కాకుండానే ఈ టాలెంట్‌టెస్ట్‌ల డ్రామా పేరుతో పెద్ద మొత్తంలో ఫీజుల రూపంలో దోచు కుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫీజు రాయితీ పేరుతో నయా దోపిడి :
తమ టాలెంట్ టెస్ట్‌లో మంచి ర్యాంకు వచ్చిన వారికి ఫీజులో రాయితీ ఉంటుందని ఇప్పుడు జాయిన్ అయితే తక్కువ ఫీజు ఉంటుందని తర్వాత అనగా డిసెంబర్, జన వరిలో అయితే ఇప్పటి ఫీజుకు డబుల్ అవు తుందని భయాందో ళనలకు గురి చేస్తున్నారు. ఒక్క రోజులోనే జాయిన్ కావాలి లేదంటే ఆ సీటును మరొకరికి కేటాయిస్తామంటూ మోసపూరిత మాటలు చెప్పడంతో ఆలోచనలో పడిన విద్యార్ధుల తల్లిదండ్రులు తమ శక్తి లేకపోయిన అప్పు తీసుకువచ్చి మరీ అడ్వాన్స్‌ల రూపంలో ఫీజులు కడుతున్నట్లు తెలుస్తుంది.దీంతో తల్లిద ండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం పరుగులు పెడుతూ హైదరాబాద్‌కు వెళ్ళి మరీ ఫీజులు కట్టించేలా మాయా ప్రపంచాన్ని కార్పోరేట్ శక్తులు సృష్టిస్తున్నప్పటికీ ప్రభుత్వం మౌనం వహిం చడం సరికాదని పలువురు అభిప్రా యాలను వ్యక్తం చేస్తున్నారు.
పిఆర్‌ఓ అవతారం ఎత్తిన కార్పోరేట్
లెక్చరర్‌లు:
గతంలో హైదరాబాద్‌కు మాత్రమే పరిమి తమైన కార్పోరేట్ కళాశాలలు నేడు చిన్న పట్టణాలకు సైతం విస్తరించాయి. చిన్నచిన్న పట్టణాలలో కాలేజిలు పెట్టుకుని మరో పదిమ ందికి జీవనోపాధిని కలిపిస్తున్న కళాశాలలు కార్పోరేట్ దెబ్బకు విలవిలలాడుతున్నాయి. దాంతో పాటు ఈ ఏడాది కార్పోరేట్ వ్యవస్ధ మరొక అడుగు ముందుకు వేసి దోపిడిలకు శ్రీకారం చుట్టింది. చిన్నచిన్న పట్టణాలలో ఏర్పాటు చేసిన కార్పోరేట్ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్‌లకు అడ్మిషన్ల టార్గెట్‌ను ఇచ్చారు. దీంతో పిఆర్‌ఓల అవతారం ఎత్తిన కార్పోరేట్ లెక్చరర్లు బోధనలను పక్కన బెట్టి అడ్మిషన్ల కోసం గాలం వేస్తున్నారు.
కార్పోరేట్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి:
కార్పోరేట్ కళాశాలల పోటీ దోపి డికి ప్రభుత్వ కళాశాలలు డీల పడు తున్నాయి. uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuగతంలో వేలాదిమంది విద్యా ర్ధులతో కళకళలాడిన ప్రభు త్వ కళాశాలలు కార్పోరేట్ కళా శాలల రాకతో కళావిహీనంగా మారాయి. 2024-25 నాటికి సుమారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 50వేల మంది 10 పరీక్షలకు సన్నద్దమ వుతున్నట్లు అంచనా. అయితే ఇటీవల కార్పోరేట్ కళాశాలలో జరుగుతున్న వరుస ఘటనలు, ఇరుకైన రూముల్లో ఊపిరాడని వసతి గృహాల సమస్యలు, ఒక్కొక్క క్యాంపస్‌లో బందల దొడ్డిని తల• •ంచే వేలాదిమంది విద్యార్ధుల రోధనలు వీటిని దృష్టిలో ఉంచు కుని ప్రభుత్వ ంకార్పోరేట్ నియంత్రణకు తగు చర్యలు తీసుకోకపోతే విద్యార్ధుల భవిష్యత్తు అంధ కారం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పలువురు మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.