కొడంగల్‌ ‌ప్రజలకు నా జీవితాంతం ఏం చేసినా తక్కువే

తెలంగాణ అభివృద్ధ్ద్దికి బిఆర్‌ఎస్‌ ‌మోకాలడ్డు
కొడంగల్‌ను అభివృద్ధ్ది చేయడం తప్పా
విద్య,వైద్య సౌకర్యాలు వారికి వద్దా
బిఆర్‌ఎస్‌ ‌తీరుపై నిప్పులు చెరిగిన సిఎం రేవంత్‌

అభివృద్ధ్దిని అడ్డుకుంటూ..గతంలో తాము చేసిందే అభివృద్ధ్ది అని చెబుతూ..అదే ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్న బిఆర్‌ఎస్‌ ‌తీరుపై తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొడంగల్‌ అభివృద్ధ్దికి మోకాలడ్డుతున్న బిఆర్‌ఎస్‌ ‌నేతల తీరును దుయ్యబట్టారు. నల్లమల్ల అడవుల్లో జంతువలను తొక్కుకుంటూ వొచ్చిన తాను వారిలాగా రాజకీయంగా ఎదగలేదన్నారు. లగచర్ల ఘటనపై అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. ‘కొడంగల్‌ ‌ప్రజలకు నా జీవితాంతం ఏం చేసినా తక్కువే. స్వాతంత్య్రం వొచ్చాక కొడంగల్‌ ‌నుంచి ఒక్కరూ మంత్రి కాలేదు. నాకు సీఎంగా అవకాశం వొచ్చింది. కొడంగల్‌ ‌నియోజకవర్గంలో చదువుకున్న వాళ్లకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని నేను    అనుకోవడం తప్పా. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ‌పోర్ట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ముచ్చర్లలో ఫార్మా సిటీ పెట్టడం తప్పు కానప్పుడ, సాగు, తాగు నీరు లేని చోట భూములు తీసుకుంటే తప్పా అంటూ ప్రశ్నించారు.  నాలుగు గ్రామాల్లో భూసేకరణ చేసి కంపెనీలు తేవాలని అనుకున్నా. కోట్ల రూపాయలు పంపించి, మందు తాగించి దాడులు చేయించారు. అధికారులు వెళ్తే రాళ్లు, రప్పలతో దాడులు చేయించారు. కొడంగల్‌లో కంపెనీలు పెట్టొద్దా, ఉద్యోగాలు ఇవ్వవొద్దా, మెడికల్‌ ‌చదువులు వొద్దా. అని ప్రశ్నించారు. అభివృద్ధికి అడ్డుపడితే తొక్కుకుంటూ పోతా అని అందుకే అంటున్నా. అన్నీ వొ ద్దు అన్నాక అభివృద్ధి పథంలో నడిపించడం ఎట్లా సాధ్యం అవుతుంది. దొంగలకు సద్దులు మోస్తున్నారు. నల్లమల అడవుల నుంచి క్రూర మృగాల మధ్య నుంచి వొచ్చాను. గుంటూరు విజ్ఞాన్‌లో చదువుకుని రాలేదు. సామాన్యుడిగా వొచ్చాను. అయ్య పేరు చెప్పుకుని రాలేదు. ఎమ్మెల్యేలను ఒత్తిడి చేసి సియోల్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పంపించలేదు. కాళ్లల్లో కట్టె పెట్టి అడ్డంపడుతున్నారు‘ అంటూ సీఎం రేవంత్‌ ‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి విషయంలో అడ్డుపడితే తెలంగాణ సమాజం క్షమించదన్నారు. గత పదేళ్ల విధ్వంసం గురించి తెలంగాణ సమాజం తెలుసుకోవాలని అన్నారు. ఇచ్చిన మాటలకు కట్టుబడి సోనియా తెలంగాణ ఇస్తే పదేళ్లపాటు అధికారం చెలాయించి వెయ్యేళ్లకు సరిపడా సంపాదించుకున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page