సెల్ ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. ఎంతలా అంటే పడుకుని లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు మన తోనే ఉంటుంది. మళ్లీ పడుకున్న తర్వాత మన పక్కనే ఉంటుంది. క్షణానికి ఒక్కసారైనా బుల్లి సెల్ఫోన్ ను చూడందే నిద్రపట్టదు. ఇది పెద్దవారి నుంచి చిన్న పిల్లల వరకు అందరికీ ఇదే రుగ్మతలా మారిపోయింది. మనకు తెలియకుండానే దానికి బానిస అవుతున్నాం. ఇది వ్యసనంగా మారి మనల్లే కాకుండా మన పిల్లలను సైతం నాశనం చేస్తోంది. మనం ఏం చేస్తామో మన పిల్లలు కూడా అదే రకంగా చేస్తారు.కాబట్టి మనం నిత్యం ఫోన్ చూస్తూ ఉంటే వారూ కూడా అదే పని చేస్తున్నారు.అతిగా ఫోన్ వాడడం,మాట్లాడడం వల్ల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది.కంటి చూపు మందగించడమే కాకుండా జ్ఞాపక శక్తి మందగిస్తున్నది. ఇక చిన్న పిల్లల్లో సృజనా త్మకత తగ్గిపోతున్నది.రోజులో ఫోన్ ఎంత తక్కువ వాడితే అంత మంచిదని, 8 ఏళ్ల లోపు పిల్లలకు ఫోన్లు ఇవ్వకపోవడం బెటర్ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
షాపింగ్ నుంచి బ్యాంకింగ్ సేవల వరకు అన్నీ మనం కూర్చున్న చోట నుంచే సెల్ ఫోన్ తోనే జరుగుతున్నాయి.వీటి వాడకం వల్ల పనులన్నీ ఈజీగా అయిపోయినట్టుగా అనిపించినా మీకు తెలియకుండానే మీరు సోమరులుగా మారిపోతారు. అలాగే సెల్ ఫోన్లకు బానిసలు అవుతారు. కొరోనా కంటే ముందు పిల్లలకు మొబైల్ ఫోన్లను ఇచ్చేవారే కాదు.కానీ కొరోనా
సమయం లో ఆన్లైన్ క్లాసుల వల్ల స్కూల్,కాలేజీ పిల్లలు మొబైల్ ఫోన్లకు బాగా అలవాటు పడ్డారు.నేటి సాంకేతిక యుగంలో చిన్న పిల్లల నుంచి ముదుసలి వరకూ సెల్ వలయంలో చిక్కుకుపోయారు. ఫోన్ అందరినీ కట్టుబానిసలుగా మార్చుకుంది.ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకూ తనపై ఆధారపడేలా మలుచుకుంది. యువతీ యువకులు,విద్యార్థులైతే అరచేతిలో స్మార్ట్‌ఫోన్లను పెట్టుకొని పొద్దస్తమానం వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు.గంటల కొద్దీ చాటింగ్ చేస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారు.సోషల్ మీడియాకు బానిసలైపోతున్నారు.ప్రత్యక్ష ఫ్రెండ్స్ కంటే ఆన్ లైన్ మిత్రులే ఎక్కువగా ఉంటున్నారు. మానవ సంబంధాలు తక్కువై కేవలం హాయ్,బాయ్ పలకరింపులతోనే సరిపెడుతున్నారు.అతిగా ఫోన్ వాడడం, మాట్లాడడం వల్ల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది.కంటి చూపు మందగించడమే కాకుండా జ్ఞాపక శక్తి మందగిస్తున్నది.
ఇక చిన్న పిల్లల్లో సృజనాత్మకత తగ్గిపోతున్నది.రోజులో ఫోన్ ఎంత తక్కువ వాడితే అంతమంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.చిన్నప్పుడు అన్నం తినకపోతో జోల పాటలు, ఉగ్గు పాటలు, పాడటం మానేసి సెల్ ఫోన్ వీడియోలు చూపిస్తూ ఇప్పటి ఆధునికతరం అమ్మలు తినిపిస్తున్నారు.ఎదుగుతున్న పిల్లల మీద స్మార్ట్ ఫోన్ లు చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి.వాళ్ళ మనసులు, శరీరాలు, మొబైల్ ఫోన్స్,టాబ్స్ లాంటి గాడ్జెట్ ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతాయి.వాళ్లకు హాని కలిగిస్తాయి.సెల్ ఫోన్లతో పాటు ఇతర వైర్లెస్ పరికరాల నుంచి వచ్చే మైక్రోవేవ్ రేడియేషన్ చాలా హానికరం.దీని ద్వారా పెద్దలకంటే పిల్లల్లో చాలా ఎక్కువగా ప్రభావం ఉంటుంది.సెల్ఫోన్ చూస్తే కళ్ల సమస్యలు వస్తాయని తెలిసినా, నిపుణులు ఎన్ని చెప్పిన వారు మాత్రం లెక్కచేయడం లేదు. కాస్త ఏడిస్తే చాలు ఇది సెల్ఫోన్ అంటూ చేతికిచ్చేస్తున్నారు. వాడు ఏడకుండా అలా చూస్తూ ఎలా ఆడుకోవాలో కూడా మరిపోయే స్థితికి వచ్చాడు.
మన సెల్ఫోన్ అలవాటు ఎంతలా ఉందంటే మూడు పూటల తినడానికి స్తోమత లేనివారు కూడా 90 శాతం సెల్ఫోన్ వినియోగిస్తుండగా,వారిలో 60 మంది శాతం మంది స్మార్ట్ఫోన్ను వినియోగిస్తున్నారని స్వయంగా లెక్కలు చెపుతున్నాయి.స్మార్ట్ ఫోన్ వాడటం మొదలు పెట్టినప్పటి నుంచి కనిపించే స్నేహితులు కన్నా, ఆన్ లైన్ మిత్రులు వందల సంఖ్యలో పుట్టుకొస్తున్నారు.ముఖ్యంగా ఫేస్ బుక్ ఫ్రెండ్స్ మరీ ఎక్కవవుతున్నారు.అమ్మాయిలను టార్గెట్ చేసే అబ్బాయిలు,అబ్బాయిలను టార్గెట్ చేసే అమ్మాయిలు ఇందులోనే ఎక్కువే.మోస పోవడం,హత్యలు చేయడం,ఆత్మహత్యలకు దారితీస్తుండటం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం.సెల్ ఫోన్ కు పూర్తిగా అడిక్ట్ అయ్యాక కాస్త మందలిస్తే తెలిసీతెలియని వయస్సులో వారిపై ప్రభావం చూపుతుంది.ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలను బలవుతున్నారు.సెల్ చూడకంటూ తండ్రి మందలించాడనో,తల్లిమందలించిందనో,అన్నమందలించినో ఉండడం మందలించడంతో క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.అవసరానికి ఉపయోగిస్తే బాగుంటుంది కానీ అస్తమానం ఉపయోగిస్తే మాత్రం ఇబ్బందులు, నష్టాలకు గురి కాకమానరు. సెల్ఫోన్ ఉంటే వాట్సాప్, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్, స్నాప్చాట్, గూగుల్, యూట్యూబ్ అంటూ సోషల్ మీడియా ఛానల్స్ చూస్తాం. ఇప్పుడు ఆ సామాజిక మాధ్యమాలే మోసాలు, ఆర్థిక సమస్యల్లో కూరుకుపోనిస్తున్నాయి.
యూత్ ఆన్లైన్లో ఆటలు ఆడుతూ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులను ఖాలీ చేసి తల్లిదండ్రులకు క్షోభను కలిగిస్తున్నారు. విద్యావంతులైన వారు సైతం ఇలాంటి మోసాల బారిన తరుచూ పడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సైబర్ దాడులు అధికం అయిపోయ్యాయి.గంజాయి, డ్రగ్స్, మద్యం ఇవే కాదు డిజిటల్ రూపంలోనూ వ్యసనం యువతను వెంటాడుతోంది. వారు మొబైల్ వదలడం లేదు. చిన్న పిల్లలు అయితే సెల్ ఫోన్ ఇస్తేనే తింటాం, చెప్పింది చేస్తాం అంటూ మారాం చేస్తున్నారు.పేరెంట్స్ కూడా వారిని బుజ్జగించే క్రమంలో పిల్లల చేతుల్లో సెల్ ఫోన్ పెట్టేస్తున్నారు.దీంతో ఆడుతూ, పాడుతూ టైం గడపాల్సిన బాల్యం, స్మార్ట్ ఫోన్ చెరలో బందీ అవుతోంది.చాలా మంది చిన్నపిల్లలు ఏడుపు ఆపడానికి సెలఫోన్లను అలవాటు చేస్తారు. కానీ ఈ సెల్ ఫోన్ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత వికిరణం పిల్లల ఆరోగ్యానికి చాలా డేంజర్ అని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలకు ఫోన్లను ఇచ్చి అన్నం తినిపించేవారు కూడా చాలా మందే ఉన్నారు. కానీ ఇలాంటి సమయంలో తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
సెల్ ఫోన్ నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు మనుషులకు చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.సెల్ ఫోన్ నుంచి వెలువడే యూవీ కిరణాలు పిల్లల కళ్లను దెబ్బతీస్తాయి. దీనివల్ల నిద్రలేమి, మెదడు పనితీరు తగ్గడం, జ్ఞానం, కొన్నిసార్లు పిల్లల ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాలేమీ తెలియక చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ఏడుపును ఆపడానికి ఫోన్ ను ఇస్తారు.సెల్ ఫోన్ ను ఎక్కువగా చూసే పిల్లల్లో మాట్లాడటంలో ఆలస్యం, మానసిక వైకల్యం,గందరగోళం, ఆలోచనా లోపం, శారీరక శ్రమ తగ్గడం వల్ల ఊబకాయం, ఎముకల ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి.మనదేశంలో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉన్న పిల్లల్లో దాదాపు 93 శాతం మంది మొబైల్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళలో చాలామందికి అవుట్డోర్ గేమ్స్ ఆడటం ఇష్టం లేదని సౌరాష్ట యూనివర్సిటీ చేసిన ఒక సర్వే తెలిపింది. దీని ప్రకారం 54 శాతం మంది పిల్లలకు వాళ్ల తల్లులే ఫోన్ వాడడం అలవాటు చేస్తున్నారని, తల్లులు పనిచేసుకొనేటప్పుడు పిల్లలు అడ్డు రాకుండా ఉండేందుకు ఫోన్ ఇచ్చి ఆడుకోమని చెబుతున్నారని, ఇలా మొబైల్ అలవాటు చేసే వాళ్ళు దాదాపు 30 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు.మిగతా 70% మంది ఇంట్లోనే ఉంటున్నారని తెలిపింది. ఇది ఏమైనాప్పటికీ పిల్లలకు సెల్ ఇవ్వడం తప్పు.సెల్ ఫోన్లు ఇవ్వడం ద్వారా పిల్లలు అనేక వ్యసనాలకు గురవుతున్నారు. ఇలా చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సెల్ ఫోన్ వాడకం పిల్లల్లో తగ్గుతుంది. అ దిశగా అందరు ప్రయత్నం చేయాలని ఆశిద్దాం.
– డాక్టర్ మోటె చిరంజీవి,
సామాజిక వేత్త,విశ్లేషకులు.
సెల్ : 9949194327.